Friday, September 12, 2025 05:16 PM
Friday, September 12, 2025 05:16 PM
roots

జగన్ పాపాలన్నీ బయటపెట్టిన తల్లి విజయమ్మ

వైఎస్ కుటుంబ ఆస్తుల వ్యవహారంలో తొలిసారి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు నాలుగు పేజీల బహిరంగ లేఖను ఆమె విడుదల చేసి అందులో సంచలన విషయాలను ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాదేస్తుంది. పెద్దలంటారు.. ఇంటి గుట్టు వ్యాధి రట్టు.. తెరిచిన పుస్తకం అని రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు అనేవారు. చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా, జరగకూడనివి అన్ని నా కళ్ళముందే జరిగి పోతున్నాయి.

ఇటీవల వైవీ సుబ్బారెడ్డి, విజయ సాయి రెడ్డి, ఇతరులు అందరూ… వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే YSR గురించి అని మరిచి.. తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా.. ఎన్నో అసత్యాలు చెప్పారు. YSR గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. YSR గారు పిల్లలు ఇద్దరు పెరుగుతున్న రోజుల నుండి, కొన్ని ఆస్తులు పాప పేరు మీద.. అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికీ కాదు. YSR గారు బ్రతికి ఉండగనే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్ట్ చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్ట్ చదివి ఉండాల్సింది.

విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్ని తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా MOU పై సాక్షి సంతకం చేశారు. అయినా… మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్దాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్న. అమ్మగా నాకు ఇద్దరు సమానమే. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానం అనేది నిజం. నలుగురు చిన్నబిడ్డలకు సమానంగా ఉండాలన్న YSR గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం.

Also Read : షర్మిల వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా

కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకు గా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. YSR గారి చివరి రోజుల్లో, జగన్ ఆయనకు ఇచ్చిన మాట ” నాన్న నీ తర్వాత ఈ లోకంలో, పాప మేలు కోరే వారిలో నేను మొదటి వాడిని ” అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది “నాలో నాతో YSR అనే పుస్తకం”లో ఎప్పుడో రాశా. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక.. 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని, 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు.

MOU ప్రకారం జగన్ 60 శాతం.. పాపకు 40 శాతం అయితే, MOU కు ముందు…సగం సగం డివిడెండ్ తీసుకొనే వారు.. ఎందుకంటే పాపకు సమాన వాట ఉంది కాబట్టి. వీటి అన్నింటికీ అప్పుడు, ఇప్పుడు, నేనే సాక్షిని. 2019 లో సిఎం అయిన రెండు నెలలకు, డివైడ్ అవ్వాలని ఇజ్రాయిల్ లో జగన్ ప్రపోజల్ పెట్టారు. జగన్ చెప్పింది ఏంటంటే… ”పిల్లలు పెద్ద వాళ్ళు అయ్యారు.. నాకు అల్లుళ్ళు వస్తారు.. నీకు అల్లుడు, కోడలు వస్తారు.. మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు.. కాబట్టి విడిపోదాం” అన్నాడు. అలా 2019 వరుకు కలిసి ఉన్న కుటుంబం, ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో.. నా సమక్షంలో, ఆస్తుల్లో ఇవి జగన్ కి, ఇవి పాప కి అని అనుకున్నారు.

MOU లో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్ గా ఇస్తున్నవి కాదు. జగన్ భాధ్యత గా ఇస్తున్నవి. అటాచ్ మెంట్ లో లేవు కాబట్టి, MOU లో ఉన్న సరస్వతి షేర్స్ 100 శాతం, MOU లో లేని ఎలహంక ప్రాపర్టీ 100 శాతం, పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండ.. ఆటాచ్ మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది” అంటూ విజయమ్మ లేఖను విడుదల చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్