Friday, September 12, 2025 08:54 PM
Friday, September 12, 2025 08:54 PM
roots

ఆ విషయంలో షర్మిలకు సహకరిస్తారా.. లేదా..?

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆస్తి విషయంలో, అధికారం విషయంలో కూడా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరికి తన చెల్లెలు కుమారుడి పెళ్లికి కూడా జగన్ వెళ్లలేదు. ఇక జగన్ ఓటమిలో షర్మిల చాలా కీలకంగా వ్యవహరించారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించిన షర్మిల… జగన్ అవినీతిని నిలువునా ఏకిపారేశారు. దీంతో జగన్‌పై ఉన్న కాస్త సానుభూతి కూడా పోయింది. ఇక ఆస్తీ కోసం సొంత చెల్లికే నోటీసులు పంపడంతో.. జగన్‌పైన షర్మిల కోపం నెక్ట్స్ లెవల్‌కు చేరుకుంది. ఇలాంటి సమయంలో షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ సర్వాత్రా ఆసక్తి రేపుతోంది.

Also Read : నెల్లూరులో వైసీపీని ముంచుతున్న మాజీ ఎమ్మెల్యే..!

వాస్తవానికి 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన వారిలో షర్మిల ముందుంటారు. ఆ తర్వాత రాజకీయ వ్యూహాలు, ఆర్థికంగా నిధులు సమకూర్చుకోవడంతో పాటు ఢిల్లీ పెద్దలతో సమన్వయం చేయడంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారనేది బహిరంగ రహస్యం. ప్రస్తుతం ఈ ఇద్దరు వైసీపీకి దూరమయ్యారు. తొలి నుంచి అన్న జగన్‌పై షర్మిల విమర్శలు చేస్తూనే ఉంది. ఇక పదవికి, పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటా అంటూ ప్రకటించారు. అయితే రెండు రోజులకే షర్మిలతో భేటీ కావడంతో పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : పవన్ డేట్స్ ఇస్తారా..? డైరెక్టర్ లో రిలీజ్ టెన్షన్స్

సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తొలి నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపైనే షర్మిల ఆరోపణలు చేస్తున్నారు. ఎలాగైనా అవినాష్‌ను జైలుకు పంపాలనేది షర్మిల ఆశయం. ఇదే సమయంలో విజయసాయిరెడ్డి కూడా ఈ హత్య కేసుపై తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. హత్యను ముందుగా గుండె పోటు అని తనకు చెప్పింది అవినాష్ రెడ్డి అని విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో ఇదే విషయాన్ని ఇప్పుడు షర్మిల తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి గతంలో షర్మిలపై విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఆస్తుల పంపకాల విషయంలో జగన్‌కు అనుకూలంగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి అబద్ధాలు చెబుతున్నారంటూ షర్మిల కౌంటర్ కూడా ఇచ్చారు. రాజీనామా చేసిన సమయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల స్పందించారు. ఇప్పటికైనా నిజాలు చెప్పాలి అంటూ డిమాండ్ చేశారు.

Also Read : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌..!

ఈ పరిణామాల్లో షర్మిలతో సాయిరెడ్డి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిలకు అనుకూలంగా సాయిరెడ్డి వ్యవహరిస్తారా… లేక జగన్ తరఫున షర్మిలతో రాజీ చేసేందుకు సాయిరెడ్డి తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. అవినాష్‌కు శిక్ష పడాలనే షర్మిల ప్రయత్నానికి విజయసాయిరెడ్డి సహకరిస్తాడా అనే చర్చ కూడా నడుస్తోంది. సాయిరెడ్డి, షర్మిల భేటీ అన్నాచెల్లెళ్ల రాజకీయ బలాబలాలపై కూడా ప్రభావితం చూపిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్