Friday, September 12, 2025 11:20 PM
Friday, September 12, 2025 11:20 PM
roots

నేనే రాజు… నేనే మంత్రి… నా మాటే శాసనం…!

ఇదే నా మాట… నా మాటే శాసనం… అంటూ బాహుబలి సినిమాలో శివగామిగా రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్. ఆ మాట ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఒక్క ఛాన్స్ అంటూ కాళ్లా వేళ్లా పడి బతిమిలాడిన జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలు, కార్యకర్తలను కూడా కలిసేందుకు కనీసం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. దీంతో ఇదేం నియంత పాలన రా బాబు అంటూ సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు చేశారు. ఇక ఓటమి తర్వాత కూడా జగన్ తీరును దగ్గరగా చూసిన కొందరు నేతలు ఇప్పటికే బై బై వైసీపీ అంటూ పారిపోయారు. అయినా సరే వైఎస్ జగన్ తీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

Also Read : రోహిత్ Vs రాహుల్.. ఓపెనింగ్ స్థానం ఎవరికి?

బెంగళూరు ప్యాలెస్‌లో ఉంటూ… వారానికో పది రోజులకో ఓ సారి తాడేపల్లి వచ్చి ఓ ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోతున్నారు తప్ప… కార్యకర్తలను కలిసింది లేదు…. నేతలతో ముచ్చటించింది లేదు. వాస్తవానికి కార్యశీలికి ప్రత్యేకంగా కార్యక్రమాలు అవసరం లేదు. తన అవసరం ఉన్నచోటును ముందుగానే గుర్తించి… అక్కడ పనిచేసుకుంటూ వెళ్లడమే నిజమైన నేత లక్షణం. ఇదే పనిని ఐదేళ్లు చంద్రబాబు చేశారు. పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైనా సరే… ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. విశాఖ, తిరుపతి ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నా సరే.. ఆగలేదు. కాన్వాయ్ మీద వైసీపీ గూండాలు రాళ్లు వేసినా సరే… భయపడలేదు. ప్రతిరోజు పార్టీ ఆఫీసుకు వచ్చారు. నేతలు, కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించారు. సమస్యలు తెలుసుకున్నారు. భరోసా ఇచ్చారు. ముందుండి నడిపించారు. చివరికి లక్ష్యం సాధించారు.

Also Read : రాజకీయ శరణార్థిగా గుర్తించండి.. ప్రభాకర్ రావు సంచలన ట్విస్ట్

అయితే జగన్ తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. పార్టీ ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తీరులో ఎలాంటి మార్పు రాలేదు. పైగా అదే నియంత పోకడలు. ఐదేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో తానే మళ్లీ గెలుస్తా అని… అప్పుడు అందరి లెక్కలు సరిచేస్తా అని ఇప్పటి నుంచే బెదిరిస్తున్నారు. అంతే తప్ప.. సొంత పార్టీని కాపాడుకోవడానికి జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు కనిపించటం లేదు. వాస్తవానికి ఓడిన నాటి నుంచే పార్టీని కాపాడుకోవడమే లక్ష్యంగా జగన్ పని చేయాలి. నేతలకు భరోసా ఇవ్వాలి. కార్యకర్తలకు ధైర్యం చెప్పాలి. అండగా ఉంటా అంటూ నమ్మకం కలిగించాలి.

కానీ జగన్ అలా చేయలేదు. కేవలం అరెస్టు అయిన నేతల కోసం మాత్రమే జైలుకు వెళ్లారు… మళ్లీ బెంగళూరు ప్యాలెస్‌కు వెళ్లిపోయారు. అంతే తప్ప పార్టీ కార్యక్రమాలపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అవ్వడంతో ఇప్పుడు సొంత చెల్లి షర్మిల సహా అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఇప్పుడు హడావుడిగా కార్యకర్తలతో జగనన్న… పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం.. అంటూ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇది కూడా ఇప్పుడు కాదంట… వచ్చే ఏడాది జనవరి నెల నుంచి అని స్వయంగా ప్రకటించారు జగన్.

Also Read : టార్గెట్ వంశీ.. ముహూర్తం ఫైనల్

వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని పార్టీ నేతలు ప్రకటించాలి.. కానీ జగన్ స్వయంగా ప్రకటించడం ఏమిటనే మాట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఓడిన ఆరు నెలల తర్వాత ఇలాంటి ప్రకటన చేయడం వల్ల… తాను కార్యకర్తలకు దూరంగా ఉన్నా… కార్యకర్తలను ఏ మాత్రం పట్టించుకోలేదు అనే విషయాన్ని జగన్ స్వయంగా ఒప్పుకున్నట్లుగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా ఇన్ని రోజులు పార్టీ నేతలు, కార్యకర్తలకు తాను ఏం చేయలేదని జగన్ పరోక్షంగా ఒప్పుకున్నాడా అని ఇప్పుడు సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్