Tuesday, October 28, 2025 01:55 AM
Tuesday, October 28, 2025 01:55 AM
roots

అర్జెంట్ గా లండన్ వెళ్ళాలి.. కోర్టులో జగన్, విజయసాయి పిటిషన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎక్కువగా రాష్ట్రం బయటే ఉంటున్నారు. ఇప్పటి వరకు బెంగళూరులోనే ఎక్కువగా ఉన్నారు. రెండు నెలల్లో ఆయన ఆరు సార్లు బెంగళూరు వెళ్ళారు. వెళ్తే దాదాపు వారం పాటు జగన్ అక్కడే ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అసలు అక్కడ ఆయన ఏం చేస్తున్నారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. ఇటీవల ఆయన కలకత్తా కూడా వెళ్ళినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఎవరికి చెప్పకుండా ఆయన ఎందుకు వెళ్ళారు అనేది వైసీపీ నేతలకు కూడా అర్ధం కాని పరిస్థితి.

YS Jagan & Vijay Sai Reddy

మంగళవారం ఆయన బెంగళూరు పర్యటన నుంచి వచ్చి తాడేపల్లి చేరుకున్నారు. మళ్ళీ ఆయన రెండు రోజుల్లో తిరిగి బెంగళూరు వెళ్ళిపోయే అవకాశం కనపడుతోంది. ఇక ఇప్పుడు మళ్ళీ విదేశీ పర్యటన కోసం వెళ్తున్నారు జగన్. ఆయనతో పాటుగా అనేక కేసుల్లో సహా నిందితుడుగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా అదే సమయంలో విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి సిబిఐ కోర్టులో పిటిషన్లు దాఖలు చేసారు. వీరిద్దరూ విదేశీ పర్యతనలకి అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో విడివిడిగా పిటిషన్లు వేసారు జగన్, విజయసాయిరెడ్డి.

జగన్ పిటిషన్ పై కౌంటర్ దాఖలుకు సమయం కోరింది సిబిఐ. జగన్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేసింది కోర్ట్. విజయసాయిరెడ్డి పిటిషన్ పై వాదనలు పూర్తి కాగా… తీర్పు ఈ నెల 30కి వాయిదా వేసారు. సెప్టెంబర్ లో లండన్ పర్యటనకి వెళ్లేందుకు అనుమతివ్వాలని సీబీఐ కోర్టును జగన్ కోరారు. సెప్టెంబర్, అక్టోబర్ లో యూరప్ వెళ్లేందుకు విజయసాయి అనుమతి కోరారు. అయితే విజయసాయి రెడ్డి పర్యటనపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ లో కేసులు నడుస్తున్న సమయంలో వీళ్ళు విదేశాలకు వెళ్ళడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వెళితే తిరిగి వస్తారా లేక అక్కడే ఉంటారా అన్న అనుమానం పలువురిలో వ్యక్తం అవుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్