Friday, September 12, 2025 05:18 PM
Friday, September 12, 2025 05:18 PM
roots

వైసీపీలో వేరే లీడర్లే లేరా..? జగన్ పై క్యాడర్ ఫైర్..!

అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పరిస్థితి ఇలా అయ్యింది ఏమిటి అనేది ఇప్పుడు వైసీపీ నేతల్లో వినిపిస్తున్న మాట. ఇందుకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలనే ఉదాహరణగా చూపిస్తున్నారు. ఐదేళ్లు నేనే రాజు… నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించిన జగన్… ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఒక్కసారిగా మారిపోయారు. ప్రతిపక్షమే వద్దని ఎన్నికల్లో ప్రచారం చేసిన జగన్.. ఇప్పుడు అదే ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతున్నాడు. ఇక అసెంబ్లీ మెట్లు ఎక్కడానికి కూడా తలవంపులుగా భావిస్తున్నాడు. అలాగే సన్మానం చేయాలని… అవార్డు ఇవ్వాలంటూ తనకు తానే గొప్పగా చెప్పుకుంటున్నాడు జగన్. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ డైలాగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు, మీమ్స్, ట్రోల్స్ హోరెత్తుతున్నాయి.

Also Read: ఫ్యూచర్ లో కూడా ఏకగ్రీవమే… బీటెక్ రవి స్ట్రాంగ్ వార్నింగ్

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు వైసీపీదే అని… అది కూడా క్లీన్ స్పీప్ చేస్తామని గొప్పగా చెప్పుకుంటున్న జగన్… పార్టీ కేడర్ దృష్టిలో మాత్రం చులకన అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. పార్టీ ప్రధాన కార్యదర్శిగా లక్ష్మీ పార్వతిని నియమించడమే. కేవలం చంద్రబాబును తిట్టడం మాత్రమే లక్ష్మీ పార్వతి చేస్తున్న పని. అంతకు మించి పార్టీలో లక్ష్మీ పార్వతి చేస్తున్న మరో పని అంటూ ఏం లేదు. చంద్రబాబుతో వైరం, నందమూరి కుటుంబంపై విమర్శలు చేయడం మాత్రమే లక్ష్మీ పార్వతి చేస్తున్నారు. అందుకే పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆమెకు ప్రొటోకాల్ పదవి కూడా కట్టబెట్టారు జగన్. ఇక ఎన్నికల సమయంలో కనీసం ప్రచారం చేయలేదు.

Also Read: ఆ మాజీకి చెక్ పెట్టనున్న చంద్రబాబు…!

ప్రెస్‌మీట్ పెట్టడం… చంద్రబాబుపై విమర్శలు చేయడం.. అంతే.. ఆ మాత్రానికే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి ఎలా ఇస్తారనేది వైసీపీలో సగటు కార్యకర్త మాట. 1994 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్‌ను రెండో వివాహం చేసుకున్నారు లక్ష్మీ పార్వతి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కూడా లక్ష్మీపార్వతి పెత్తనం చేస్తున్నారని గమనించిన టీడీపీ నేతలు… 1995లో ఎన్టీఆర్‌తో విబేధించారు. ఆ సమయంలోనే నందమూరి కుటుంబం మొత్తం చంద్రబాబుకు మద్దతుగా నిలిచింది. నాటి నుంచి చంద్రబాబు అంటే లక్ష్మీపార్వతికి కోపం. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం అని ఓ పార్టీ కూడా పెట్టి 1999 ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఆ ఎన్నికల్లో కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదు.

Also Read: పోలవరం ప్రాజెక్టు సురక్షితమేనా…?

దీంతో సైలెంట్‌గా పార్టీ మూసేశారు. ఆ తర్వాత నుంచి వైఎస్ కుటుంబంపై వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారు. ఇక జగన్‌ వెంట నడుస్తూ.. 2014 ఎన్నికలకు ముందు శ్రీకాకుళంలో జరిగిన బహిరంగ సభలో వైసీపీ కండువా కప్పుకున్నారు. పదేళ్లుగా పార్టీలో కొనసాగుతున్నప్పటికీ.. గెలుపు కోసం చేసిన ఒక్క పని కూడా లేదు. అలాంటి వ్యక్తిని ఎలా ప్రధాన కార్యదర్శి చేస్తారనేది సగటు వైసీపీ కార్యకర్త ప్రశ్న. సొంత పార్టీకి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వ్యక్తిని ఈ వయసులో ప్రధాన కార్యదర్శి చేయడం ఏమిటని విమర్శిస్తున్నారు. మరికొందరైతే.. అసలు వైసీపీలో ప్రధాన కార్యదర్శి పదవికి సరిపోయే లీడర్లే లేరా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్