రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సొంత అభిప్రాయాల కంటే కార్యకర్తల మనోభావాలకు ఎక్కువగా విలువ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విషయంలో తప్పు చేసిన ఎందరో నాయకులు కాల గర్భంలో కలిసి పోయారు. డబ్బు, తప్పుడు ప్రచారం వంటివి ఎక్కువ కాలం కాపాడలేవు. కార్యకర్తల్లో ఒక్కసారి అధినేతపై అభిప్రాయం మారితే, రాజకీయం చేయడం కష్టమే. ఈ విషయాన్ని ఏపీ సిఎం వైఎస్ జగన్ మర్చిపోయారు. బిజెపికి ఒకరకంగా ఆయన లొంగిపోవడం ఆ పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరుస్తోంది.
Also Read : సజ్జలకు ఎర్త్ పెట్టిన నారాయణ స్వామి.. తర్వాత సలహాదారే..?
2014 కు ముందు కాంగ్రెస్ అధిష్టానంపై పోరాటం చేసి హీరో ఇమేజ్ తెచ్చుకున్న జగన్.. ఇప్పుడు బిజెపికి ప్రతీ అంశంలో మద్దతు ఇచ్చేస్తూ.. కార్యకర్తల్లో చులకన అయ్యారు. కానీ 2014 నుంచి కూడా జగన్ లాలూచీ రాజకీయాలు చేయడం ఆ పార్టీ కార్యకర్తలు అవమానంగా భావిస్తున్నారు. తాజాగా జగన్.. ఎన్డియే కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇచ్చేసారు. ఇది ఎందుకో అందరికి స్పష్టంగా అవగాహన ఉంది. కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వకపోయినా.. సైలెంట్ గా ఉంటారని భావించారు.
Also Read :గంజాయిలో కూడా అరుణ పాత్ర..? చికెన్ వేస్ట్ లో గంజాయి..?
ఇక ఇండియా కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి.. జగన్ కు ఫోన్ చేసారు. మద్దతు ఇవ్వాలని కోరారు. దానికి జగన్ ఇచ్చిన సమాధానం విడ్డూరంగా ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. వైఎస్ జగన్‌కు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఫోన్ చేయగా.. ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటించేలోపే ఎన్డీఏకు మద్దతు ఇస్తానని మాట ఇచ్చానని జగన్ సమాధానం ఇచ్చారు. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు తప్పుగా భావించద్దని చెప్పడం గమనార్హం. ఈ విషయం బయటకు రాగానే వైసీపీ కార్యకర్తలు జగన్ పై విరుచుకుపడ్డారు. దీనిపై టీడీపీ కార్యకర్తల కంటే వైసీపీ కార్యకర్తలే ఎక్కువగా విమర్శలు చేయడం ఆశ్చర్యపరిచింది.