కానిస్టేబుల్ పై దాడి చేసిన వ్యవహారంలో తెనాలికి చెందిన ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు బహిరంగంగా శిక్షించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా నేడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెనాలి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున టిడిపి ఆరోపణలు చేస్తుంది. ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మంత్రులు దీనిపై కఠినంగానే సమాధానం ఇస్తూ వస్తున్నారు.
Also Read : బ్రహ్మపుత్ర నదికి చైనా బ్రేక్ వేస్తే..?
ఇక జగన్ అక్కడికి వెళ్లిన సందర్భంగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున హడావుడి కూడా చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ జగన్ అక్కడికి వెళ్లి మాట్లాడిన మాటలు ఆశ్చర్యపరిచాయి. మంగళగిరి వాళ్లను తెనాలి తీసుకెళ్లి పోలీసులు కొట్టారని ఆయన ఆరోపించారు. అసలు వారిపై ఎటువంటి కేసులు లేకపోయినా.. కావాలని మంగళగిరి నుంచి తెనాలి తీసుకెళ్లి హింసించారని అన్నారు. ఇది విన్న అక్కడివారు కూడా ఒకరకంగా షాక్ అయ్యారు. మంగళగిరి వాళ్ళను తెనాలి తీసుకెళ్లి కొడితే.. మరి జగన్ తెనాలిలో వాళ్ళ నివాసానికి ఎలా వెళ్లారు అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు.
Also Read : ఆ కేసులో జగన్ ను పెద్దలు కాపాడతారా..?
ఇక గతంలో వారు చిన్న చిన్న తప్పులు చేసి ఉండొచ్చని.. అలాంటి వారిపై కేసులు ఏ విధంగా పెడతారంటూ జగన్ నిలదీశారు. వయసులో ఉన్నప్పుడు చిన్నచిన్న తప్పులు సహజమే అని వాళ్ళు చేసిన.. నేరాలకు మద్దతు ఇచ్చే విధంగా జగన్ మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. వారిపై గంజాయి కేసులతోపాటుగా పలు వ్యవహారాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ విషయం తెలిసిన స్థానిక వైసీపీ నేతలు మౌనంగా ఉన్నా సరే జగన్ మాత్రం హడావుడి చేయడం గమనార్హం. ముందు నుంచి ఇటువంటి కార్యక్రమాలను పరోక్షంగా ప్రోత్సహించే జగన్ ఇప్పుడు అదే తరహాలో వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తుంది.