Tuesday, October 28, 2025 02:16 AM
Tuesday, October 28, 2025 02:16 AM
roots

జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ.. బీ అలర్ట్..!

జగన్ బలపడుతున్నాడా.. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వైసీపీని సిద్థం చేస్తున్నాడా.. పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో వై నాట్ 175 అనే టార్గెట్‌తో వైసీపీ బరిలోకి దిగింది. అయితే చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. 11 స్థానాలకే వైసీపీ పరిమితం కావడంతో.. ముఖం చూపించేందుకు కూడా జగన్‌కు బయటకు రావటం లేదు. మకాం కూడా పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు ఎలహంక ప్యాలెస్‌కు మార్చేశారు. ఎక్కడా శవం అన్నట్లుగా ఏపీలో ఎక్కడైనా శవం కనిపిస్తే.. అక్కడికి వెళ్లి.. పరామర్శించి ఓ నాలుగు మాటలు చెప్పేసి మళ్లీ తిరుగు ఠపాలో బెంగళూరు వెళ్లిపోయారు జగన్. అలాంటి పరిస్థితి నుంచి ప్రస్తుతం మళ్లీ యాక్టివ్ అవుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. వైసీపీ ప్రారంభంలో అంతా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులే ఉన్నారు. కానీ ప్రస్తుతం వైసీపీలో జగన్ సైన్యం మాత్రమే ఉంది. వీరికి సైకోలు అనే పేరు కూడా ఉంది. వీరికి జగన్ చెప్పింది వేదం.. చేసింది చట్టం.. అందుకే ఐదేళ్ల పాటు ఏపీలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురైనా కూడా.. జగన్ వల్ల మంచే జరిగింది అని ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతున్నారు.. వాదిస్తున్నారు కూడా. ఎవరైనా కాదు అని ఎదురు చెబితే.. వారిపై దాడి చేసేందుకు కూడా తెగబడతారు. ఇలాంటి వారు కూడా జగన్‌ తీరుపై కొద్ది రోజుల పాటు అసహనం వ్యక్తం చేశారు. పార్టీ ఓటమి తర్వాత జగన్ సైలెంట్ అవ్వడంతో పాటు ముఖ్య నేతలు ఒకరిద్దరు అప్పట్లో అరెస్టు కావడం.. కీలక నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పడంతో జగన్ సైన్యం వెనక్కి తగ్గింది. దీంతో వైసీపీ చచ్చుబడిపోయిందని అంతా భావించారు. దీంతో కూటమి సర్కార్‌కు జగన్‌ను లైట్ తీసుకుందనే చెప్పాలి.

Also Read : వరుస ప్రమాదాలకు కారణాలేమిటి..?

ఇక్కడే జగన్ తన ప్లాన్‌ మొదలుపెట్టారు. కూటమి సర్కార్ ఫోకస్ మొత్తం తన నుంచి డైవర్ట్ అయ్యేలా చేశారు. కొద్ది రోజుల పాటు సైలెంట్‌గా బెంగళూరుకు ఫిఫ్ట్ కావడంతో.. క్యాడర్ కూడా సైలెంట్ అయ్యింది. దీంతో ఎప్పటిలాగే చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు రాబట్టడం, అమరావతి, పోలవరం నిర్మాణం పూర్తి, గాడి తప్పిన పాలనను తిరిగి పట్టాలెక్కించడం వంటి అంశాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. దీంతో తనపై ఫోకస్ తగ్గినట్లు భావించిన జగన్.. తిరిగి రంగంలోకి దిగారు. ముందుగా తరచూ తాడేపల్లి రావడం ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు ప్రారంభించారు. ముందుగా పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీని నియమించారు. ఈ కమిటీ ఏర్పాటుపై పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. పీఏసీ సభ్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు, ఇంఛార్జులతో తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ముందుగా తమ పార్టీ నేతలపై కూటమి సర్కార్ పెడుతున్న కేసుల గురించి ఆరా తీశారు. అరెస్టైన వారికి అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీని వల్ల జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారంతా పార్టీకి పనిచేస్తారనేది జగన్ భావన.

Also Read : టీమిండియాకు మరో సచిన్ దొరికినట్లేనా..!

నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న జగన్.. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. ముందుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులను గుర్తించారు. వారికి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. మొత్తం 25 పార్లమెంట్‌ స్థానాలకు 25 మందిని నియమించారు. వీరిలో సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు ఎన్నికల ముందు పార్టీలో చేరిన పోతిన మహేశ్‌కు కూడా చోటు దక్కింది. వీరంతా ఆయా పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి.. పార్టీ పరిస్థితిపై అంచనా వేయనున్నారు. అలాగే ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలు, నేతలతో భేటీ కానున్నారు. నియోజకవర్గాల పరిస్థితిని అంచనా వేసి ఓ నివేదిక రూపొందిస్తారు. దానిని పీఏసీకి అందిస్తారు. దానిపై అధ్యయనం చేసిన పీఏసీ.. పూర్తిస్థాయి రిపోర్టును జగన్‌కు అందించాల్సి ఉంటుంది. ఈ రిపోర్టు ఆధారంగా రాబోయే రోజుల్లో పార్టీ కార్యాచరణ రూపొందించే దిశగా జగన్ ప్లానింగ్ చేయనున్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.

Also Read : అమరావతి అన్ స్టాపబుల్.. చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ 

స్థానిక సంస్థల ఎన్నికల నాటికి పార్టీని తిరిగి గాడిలో పెట్టాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో 23 స్థానాలే గెలిచిన తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంది. దీని వల్ల అప్పట్లో టీడీపీ క్యాడర్ కాస్త ఢీలా పడింది. కొందరు నేతలు పోటీ చేద్దామని అధినేత చంద్రబాబుకు స్వయంగా సూచించారు కూడా. కానీ చంద్రబాబు మాత్రం… వద్దని వారించడంతో.. వైసీపీ గెలుపు దాదాపు ఏకపక్షమైంది. దీనిని తమకు అనుకూలంగా మలుచుకున్న జగన్.. టీడీపీకి మనుగడ లేదంటూ తప్పుడు ప్రచారం కూడా చేశారు. కానీ పడి లేచిన కెరటం మాదిరిగా ఉవ్వెత్తున ఎగసిన తెలుగుదేశం పార్టీ.. 2024 ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. వైసీపీ పూర్తిగా కనుమరుగు అంటూ టీడీపీ నేతలు సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ జగన్ మాత్రం.. పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్లు తప్ప.. అన్న కారల్ మార్క్స్ సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్లు తెలుస్తోంది. చాపకింద నీరులా వైసీపీని ఎన్నికల నాటికి బలోపేతం చేసేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. అదే జరిగితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి వైసీపీ నుంచి గట్టి పోటీ తప్పదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికైనా కూటమి పార్టీలు అలర్ట్ కాకపోతే.. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. సో.. బీ అలర్ట్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్