Friday, September 12, 2025 07:23 PM
Friday, September 12, 2025 07:23 PM
roots

బయటపడ్డ వైసీపీ డబుల్ గేమ్..!

మాట తప్పడు.. మడమ తిప్పడు.. ఇదే జగన్ ట్యాగ్ లైన్. అయితే ఇదంతా పబ్లిక్ కోసం మాత్రమే. అసలు జగన్ వేరే ఉంటారు. తనకు అనుకూలంగా పరిస్థితులను మలుచుకోవడంలో జగన్ దిట్ట అనేది అందరికీ తెలిసిన విషయమే. 2014లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కేంద్రంలోని మోదీ సర్కార్‌పై లెక్కలేనన్ని విమర్శలు చేశారు జగన్. ఒక దశలో కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తా అంటూ గొప్పలు చెప్పారు కూడా. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో దోస్తీ చేశారు. పైకి విమర్శిస్తూనే.. కేంద్రం ప్రతిపాదించిన అన్ని బిల్లులను కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆమోదించింది వైసీపీ.

Also Read : జగన్ నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్..!

కేంద్రం ప్రతిపాదించిన సీఏఏ, ఆర్టికల్ 360 రద్దు వంటి కీలక బిల్లులకు ఎలాంటి షరతులు విధించకుండానే వైసీపీ అనుకూలంగా ఓటు వేసింది. అయితే తాజాగా వక్ఫ్ బిల్లును కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని వల్ల మైనారిటీలకు లాభం జరుగుతుందని తొలి నుంచి చెబుతోంది. అయితే దీనికి మార్పులు చెప్పిన తెలుగుదేశం పార్టీ.. అవి అమలు చేయడంతో ఆ తర్వాతే బిల్లుకు మద్దతు తెలిపింది. అయితే దీనినే తనకు అనుకూలంగా మార్చుకున్న జగన్.. మైనారిటీల హక్కులను తెలుగుదేశం పార్టీ కాలరాస్తోందంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది వైసీపీ. వక్ఫ్ బిల్లు వల్ల మైనారిటీలకు తీరని నష్టం జరుగుతోందని తెగ గగ్గొలు పెట్టారు. వక్ఫ్ బిల్లు విషయంలో టీడీపీ డబుల్ గేమ్ ఆడిందంటూ తప్పుడు ప్రచారం కూడా చేశారు. ఒక దశలో చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ… సోషల్ మీడియాలో బాయ్‌కాట్ హెరిటేజ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు.

Also Read : ఎస్.. రెడ్ బుక్ కోసమే పోలీసులు పని చేస్తారు

అయితే వాస్తవానికి వక్ఫ్ బిల్లు విషయంలో డబుల్ గేమ్ ఆడింది ఎవరు అనే విషయం ఓసారి పరిశీలిస్తే.. అన్ని వేళ్లు కేవలం వైసీపీ వైపే చూపిస్తున్నాయి. వక్ఫ్ బిల్లు సభ ముందుకు వస్తున్న సమయంలో టీడీపీ, జనసేన పార్టీలు తమ పార్టీ సభ్యులకు విప్ జారీ చేశాయి. సభ్యులంతా తప్పనిసరిగా సభకు హాజరవ్వాలని… చర్చలో పాల్గొనాలని… ఆ తర్వాత బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని విప్‌లో స్పష్టం చేశాయి. కానీ వైసీపీ మాత్రం ఇక్కడే తన నిజస్వరూపం బయటపెట్టింది. లోక్‌సభలో బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడారు వైసీపీ సభ్యులు. అది కూడా చాలా సుతిమెత్తగానే. ఎలాగూ మెజారిటీ సభ్యులున్నారు కాబట్టి… లోక్‌సభలో వక్ఫ్ బిల్లు పాసైపోతుంది. అప్పుడు తాము వ్యతిరేకంగా మాట్లాడినా.. పెద్దగా ఇబ్బంది రాదు. పైగా మైనారిటీల దగ్గర మార్కులు కొట్టేయచ్చు అనేది వైసీపీ ప్లాన్.

Also Read : మోడీ షాకింగ్ నిర్ణయం.. వారసుడు ఎవరు..?

ఇదే సమయంలో రాజ్యసభలో మాత్రం వైసీపీ నిజస్వరూపం బయటపడింది. వక్ఫ్ బిల్లు రాజ్యసభలో చర్చకు వస్తుందని తెలిసినప్పటికీ.. తమ పార్టీ ఎంపీలకు ఎలాంటి విప్ జారీ చేయలేదు. దీంతో సభకు సభ్యులంతా రావాలనే నియమం కూడా లేకుండా పోయింది. లోక్‌సభ విషయంలో టీడీపీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన వైసీపీ.. రాజ్యసభ అంశంలో మాత్రం కనీసం నోరెత్తలేదు. వక్ఫ్ సవరణ బిల్లులో మైనారిటీలల అభ్యంతరాలను కూటమి సర్కార్ పట్టించుకోలేదని రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. బిల్లు మత స్వేచ్ఛను హరించేలా ఉందన్నారు. అదే సమయంలో బిల్లుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి బిల్లు విషయంలో రాజ్యసభలో బీజేపీ యూ టర్న్ తీసుకుంది. మనసాక్షి ప్రకారం ఎంపీలు ఓటు వేయవచ్చ అంటూ బీజేడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే మాటను తమకు అనుకూలంగా తీసుకున్నారు వైసీపీ ఎంపీలు. వక్ఫ్ బిల్లుకు బేషరతుగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. అందుకే రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. పూర్తిస్థాయి మెజారిటీ లేకపోయినప్పటికీ.. 3 ఓట్లు అధికంగా రావడంతో.. రాజ్యసభలో వక్ఫ్ బిల్లు పాసైపోయింది. దీంతో వైసీపీ ఆడిన డబుల్ గేమ్ ఇప్పుడు బట్టబయలైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్