వైసిపి హయాంలో గతంలో అమరావతి విషయంలో ఏ రేంజ్ లో కక్ష సాధింపు జరిగిందనేది అందరికీ అవగాహన ఉంది. అమరావతిని రాజధానిగా ఉంచడానికి ఇష్టపడని వైయస్ జగన్ ఆ తర్వాత విశాఖను రాజధాని చేయడానికి నానా ప్రయత్నాలు చేసారు. అయితే కోర్టు కేసులతో విశాఖలో రాజధాని ఏర్పాటు ఆగింది. ఈ క్రమంలో అమరావతిలో 2014 నుంచి 2019 వరకు అప్పటి ప్రభుత్వం చేపట్టిన పనులను ముందుకు తీసుకెళ్లలేదు జగన్ ప్రభుత్వం. దీనితో ఆ ప్రాంతం మొత్తం ఒక అడవిలా మారిపోయింది.
Also Read : ఫలించిన అమిత్ షా వ్యూహం.. వారికి కోలుకోలేని దెబ్బ..!
కేవలం అడవిలానే కాదు చేపల చెరువులా కూడా మారిపోయింది అనేది తాజాగా రుజువైంది. ప్రస్తుతం అమరావతి పనులను మొదలు పెట్టే ప్రయత్నంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అడవిలా మారిపోయిన ప్రాంతాలను సాధారణ స్థితికి తీసుకొచ్చింది. సచివాలయం అలాగే ప్రభుత్వ ఉద్యోగుల కార్యాలయాల కోసం ఐదు ఐకానిక్ టవర్లు, హైకోర్టు భవనాల పునాదుల కోసం భారీ గుంతలను తవ్వింది. ఆ గోతులలో భారీగా వర్షం నీరు చేరి లోతైన పెద్ద చేపల చెరువులుగా మారిపోయాయి.
Also Read : ఏబీవీపై కేసు పెట్టాలంటున్న సాక్షీ.. మరి విజయసాయి రెడ్డిని ఏం చేయాలి…?
గత ఐదేళ్లు అన్ని కాలాల్లోనూ అవి నీటితో నిండే ఉండడంతో చేపలు పెద్ద ఎత్తున పెరిగాయి. దాదాపు ఆ గుంతల్లో 500 కిలోల వరకు చేపలు పట్టుకున్నట్లు అక్కడి స్థానికులు చెప్తున్నారు. 6 నుంచి 7 కిలోల బరువున్న చేపలను గుంతల్లో బయటకు తీశారు మత్స్యకారులు. ఉభయగోదావరి జిల్లాలో కూడా దొరకని చేపల రకాలు అమరావతిలో అందుబాటులో ఉంచారు జగన్. అక్కడ పట్టుకున్న చేపలను విజయవాడ సహా తదితర మార్కెట్లకు తరలించి సొమ్ము చేసుకున్నారు మత్స్యకారులు. ఇది చూసిన అక్కడ అధికారులు కూడా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆ నీటిని పెద్ద పెద్ద మోటర్లతో ఎత్తిపోస్తున్నారు అధికారులు.