Tuesday, October 28, 2025 01:58 AM
Tuesday, October 28, 2025 01:58 AM
roots

వాళ్ళు రంజీలు ఆడరా..? ఇది పొగరా..?

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ గుర్తున్నాడా…? శ్రీలంక మాజీ కెప్టెన్ కుమారా సంగర్కర గుర్తున్నాడా…? ఇండియన్ క్రికెట్ దిగ్గజాలు సౌరవ్ గంగూలి, సచిన్ టెండూల్కర్ లు గుర్తున్నారా…? వీళ్ళ గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా దేశవాళి క్రికెట్ కు వీళ్ళు ఇచ్చిన ప్రాధాన్యత గుర్తు ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే దేశవాళి క్రికెట్ ఆడే విషయంలో అసలు ఏ మాత్రం రాజీ పడేవాళ్ళు కాదు. క్రికెటర్లను హీరోలుగా చూసే రోజుల్లో కూడా… యువ ఆటగాళ్ళతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నారు.

పైన చెప్పిన ఆటగాళ్ళు అందరూ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా దేశవాళి క్రికెట్ ఆడారు. సంగక్కర ఇప్పటికీ కౌంటీ క్రికెట్ ఆడుతూనే ఉంటాడు. అంతెందుకు… రవిచంద్రన్ అశ్విన్, పుజారా, రహానే వంటి సీనియర్ ఆటగాళ్ళు కూడా ఇప్పటికీ దేశవాళి క్రికెట్ ఆడుతూనే ఉంటారు. మరి టీం ఇండియా స్టార్ ఆటగాళ్లకు వచ్చిన సమస్య ఏంటీ…? ఖాళీ సమయాల్లో రంజీ, ఇరానీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ వంటివి ఎందుకు ఆడలేకపోతున్నారు…? విరాట్ కోహ్లీ గెస్ట్ గా ఇండియా వచ్చి క్రికెట్ ఆడి వెళ్ళడం ఏంటీ…? జట్టులో అత్యుత్తమ ఫిట్నెస్ కలిగి ఉన్న ఆటగాళ్లలో కోహ్లీయే ప్రధమ స్థానంలో ఉంటాడు. అలాంటి ఆటగాడు దేశవాళీ పోటీల్లో పాల్గొంటే యువతకి కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

Also Read : కెన్యా మృగాల మధ్యన జక్కన్న

రోహిత్ శర్మ… మంచి ఆటగాడే కాదు అనలేం… కానీ రంజీ క్రికెట్ ఆడటానికి వచ్చిన సమస్య ఏంటీ…? ఇండియన్ పిచ్ లపై బూమ్రా ప్రభావం చాలా తక్కువ. అతను ఎందుకు రంజీ క్రికెట్ ఆడలేకపోతున్నాడు… ఇరానీ ట్రోఫీ లో ఎందుకు పాల్గొనలేదు..? ఈ ప్రశ్నలకు ఆటగాళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కివీస్ పై టెస్ట్ సీరీస్ ఓడిపోవడం అనేది భారత్ కు చిన్న విషయం ఏం కాదు. ఆటగాళ్ళలో నైపుణ్యం పెరగడానికి రంజీ క్రికెట్ లేదంటే ఇతర దేశవాళి ట్రోఫీలు చాలా ఉపయోగపడతాయి. కానీ క్రికెట్ ను ఏదో జాబ్ లా చూడటం, ఆడినా ఆడకపోయినా టీంలో చోటు ఉంటుంది అనుకోవడం విస్మయానికి గురి చేస్తోంది. అసలు బోర్డు… ఏ కాంట్రాక్ట్ లో ఉన్న ఆటగాళ్ళు అయినా దేశవాళి క్రికెట్ ఆడాల్సిందే అనే కండీషన్ పెట్టాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్