Friday, September 12, 2025 07:02 PM
Friday, September 12, 2025 07:02 PM
roots

రెండో మ్యాచ్ కు అయినా రాహుల్ వస్తాడా…?

ఐపిఎల్ మ్యాచ్ లు రోజు రోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. ముందు బలంగా కనపడిన జట్లు ఆ తర్వాత బలహీనంగా కనపడుతున్నాయి. చెన్నై, హైదరాబాద్ మొదటి మ్యాచ్ లో విజయం సాధించినా రెండో మ్యాచ్ లో బోల్తా పడ్డాయి. లక్నో మొదటి మ్యాచ్ లో ఫెయిల్ అయినా రెండో మ్యాచ్ లో ఫాం లోకి వచ్చేసింది. హైదరాబాద్ లాంటి జట్టును కంట్రోల్ చేసింది. పంజాబ్ జట్టు ఊహించని రేంజ్ లో ప్రదర్శన చేసింది. ఇక్కడి నుంచి మ్యాచ్ లు ఆసక్తికరంగా మారే సూచనలు కనపడుతున్నాయి. ఈ టోర్నీలో ఢిల్లీ జట్టు బలంగా కనపడుతోంది.

Also Read : ధోనీపై సొంత ఫ్యాన్స్ తిట్లు

మొదటి మ్యాచ్ లో లక్నోపై మంచి విజయం సాధించింది. దీనితో రెండో మ్యాచ్ పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌ పై ఢిల్లీ ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. ఈ మ్యాచ్ కు స్టార్ ప్లేయర్ కెఎల్ రాహుల్ అందుబాటులోకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈ ఏడాది సీజన్ కోసం ఢిల్లీ జట్టులో చేరిన రాహుల్.. తన భార్య డెలివరి కారణంగా మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. ఇక ఈ సీజన్ లో రాహుల్ ఏ స్థానంలో ఆడతాడు అనేది ఆసక్తిగా మారింది.

Also Read : ఐపిఎల్ లో పర్సనల్ రివేంజ్

ఓపెనర్ గా, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఏ స్థానంలో అయినా రాణించే రాహుల్ ను ఓపెనర్ గా పంపాలని ఢిల్లీ భావించినా.. తాను మిడిల్ ఆర్డర్ లోనే ఆడతాను అని రాహుల్ చెప్పడంతో అతన్ని 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపే అవకాశం ఉంది. రాహుల్ చేరికతో ఖచ్చితంగా ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ మరింత బలపడనుంది. చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన రాహుల్.. ఐపిఎల్ లో కూడా అదే రేంజ్ లో రాణిస్తాడు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్