ఇంగ్లాండ్ పర్యటన అనగానే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఎవరు అనేదానిపై క్రికెట్ అభిమానుల్లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా పర్యటనను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ విషయంలో సెలెక్టర్లు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకున్నట్టుగానే కనపడుతోంది. ఆస్ట్రేలియా పర్యటనలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కాస్త పరవాలేదు అనిపించాడు. ఓ సెంచరీ కూడా చేశాడు. కానీ వికెట్లు తీసే విషయంలో మాత్రం తడబడ్డాడు. ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండే మైదానాల్లో అతను తేలిపోయాడు.
Also Read : తెలంగాణలో బీజేపీ షాకింగ్ సర్వే.. టార్గెట్ రేవంత్ కాదా..?
దీనితో ఇంగ్లాండ్ పర్యటనలో అతనికి అవకాశం వస్తుందా లేదా అనే దానిపై చాలా చర్చలు నడుస్తున్నాయి. అయితే శార్దూల్ ఠాకూర్ కారణంగా అతనికి అవకాశం వచ్చే సూచనలు కనపడటం లేదనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఠాకూర్ కు ఇంగ్లాండ్ మైదానాల్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులపై స్పష్టమైన అవగాహన ఉంది. బ్యాటింగ్ తో పాటుగా బౌలింగ్ కూడా చేయగలిగే సామర్థ్యం అతని సొంతం. బౌలింగ్లో వేగంతో పాటుగా స్వింగ్ సైతం ఉంటాయి. గతంలో కీలక సమయాల్లో వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన సందర్భం కూడా ఉంది.
Also Read : రేవంత్ కు ఒళ్ళు మండింది.. మరి ఏసీబీ యాక్షన్ ప్లాన్ ఏంటో..?
అందుకే ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం రాకపోవచ్చు అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఖచ్చితంగా కెప్టెన్ గిల్.. అనుభవాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. నితీష్ కుమార్ రెడ్డితో పోలిస్తే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో మెరుగ్గా రాణించగలిగే ఆటగాడు. తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో సైతం అతను ప్రభావం చూపిస్తున్నాడు. ఓ మ్యాచ్ లో సెంచరీ కూడా చేసి అదరగొట్టాడు. దీనితో నితీష్ కుమార్ రెడ్డికి అవకాశాలు రాకపోవచ్చు అని క్రికెట్ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.




