Friday, September 12, 2025 10:32 PM
Friday, September 12, 2025 10:32 PM
roots

ఏపీ కొత్త మంత్రి ఆయనేనా…?

ఆంధ్రప్రదేశ్ లో ఓ మంత్రి పదవి ఖాళీగా ఉంది. అసలు ఈ మంత్రి పదవిని ఎవరితో భర్తీ చేస్తారు…? విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణం రాజు ఇలా చాలా పేర్లు వినపడుతున్నాయి. అలాగే ఎమ్మెల్సీలు కూడా కొందరు మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక దేవినేని ఉమాకు లేదా ఆలపాటి రాజాకు కూడా మంత్రి వర్గంలో అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం గట్టిగానే సాగుతోంది. కాని అసలు ఆ ఒక్క మంత్రి పదవి విషయంలో చంద్రబాబు ఆలోచన ఏంటీ అనేది బయటకు రాలేదు.

కాని ఇప్పుడు వస్తున్న ఓ వార్త ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో అడుగు పెట్టె అవకాశం ఉందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఆదివారం జరిగిన ఓ పరిణామమే దీనికి బలం చేకూర్చింది అంటున్నారు. సీఎం చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు సీఎం చంద్రబాబు సోమవారం ఢిల్లీ పర్యటన ఉంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా హోం మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. ఈ భేటీలో ఏం చర్చించాలి అనేది కిరణ్ తో చంద్రబాబు చర్చించారని ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ భేటీ వెనుక ఉద్దేశం… కిరణ్ ను కేబినేట్ లోకి తీసుకోవడమే. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేయగా… ఇదే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లా రాజంపేట లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. ఇప్పుడు కిరణ్ ఖాళీగానే ఉన్నారు. ఆయనలో విషయం ఉందని గ్రహించిన చంద్రబాబు… ఢిల్లీ పర్యటనలో భాగంగా, కిరణ్ ను కేబినేట్ లోకి తీసుకుంటున్నా అని చెప్పే అవకాశం ఉంది అనే మాట వినపడుతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా తర్వాత కిరణ్ కేబినేట్ లో ఉంటారని టాక్. సిఎంగా కిరణ్ అప్పట్లో కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ విషయంలో ఆయన నిర్ణయాలు సంచలనం అయ్యాయి. ఇక బలమైన వాగ్దాటి కూడా కిరణ్ సొంతం. అందుకే కిరణ్ కు కేబినేట్ లో అవకాశం కల్పించాలని బాబు భావిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్