వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా కష్టంగా ఉంటుంది. కొన్ని కొన్ని పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఏ నిర్ణయాలు తీసుకుంటాయి, నాయకులు ఏ విధంగా మాట్లాడుతారు అనేది అంచనా వేయడం కూడా కష్టమే. ఒకప్పుడు బలంగా కనపడిన నాయకులు క్రమంగా బలహీనపడుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఇదే. ఆ పార్టీ రాజకీయ పరిస్థితి అంచనా వేయడం చాలా కష్టంగా ఉంది. ఒకప్పుడు అత్యంత బలంగా కనపడిన ఆ పార్టీ ఇప్పుడు కనీసం మీడియాలో కనపడేందుకు కూడా ఇబ్బంది పడుతోంది.
Also Read : ఏదైనా బావిలో దూకి చావండి..!
ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలి ఆ పార్టీ కార్యకర్తలకు ఏమాత్రం అర్థం కానీ పరిస్థితి. ఒకప్పుడు కేటీఆర్ ప్రసంగాలకు మీడియాలో మంచి వెయిట్ ఉండేది. అధికారం కోల్పోయిన తర్వాత కూడా పదేపదే మీడియాలో కనపడుతూ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రమైన విమర్శలు చేసేవారు కేటీఆర్. కానీ ఇప్పుడు పరిస్థితి ఊహించని విధంగా మారడంతో ఏ విధంగా కూడా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. తన సోదరి.. కవిత.. పార్టీ కీలక నేత హరీష్ రావు పై తీవ్ర విమర్శలు చేసినా సరే కేటీఆర్ మాత్రం మీడియా ముందుకు రాలేకపోయారు. కాలేశ్వరం కమిషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా సిబిఐకి కేసు అప్పగించిన సరే కేటీఆర్ మాత్రం గతంలో మాదిరిగా విమర్శలు చేయలేకపోతున్నారు.
Also Read : ఇలా తయారయ్యా రేంట్రా బాబు మీరు..!
ఇదే సమయంలో ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో దూకుడు ప్రదర్శించిన సరే కేటీఆర్ నుంచి స్పందన లేదు. అటు భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా నిన్నటి నుంచి మీడియా ముందుకు వచ్చి సమర్థవంతంగా మాట్లాడలేకపోతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. ముందు కేటీఆర్.. ఈ కేసు విషయంలో కాస్త దూకుడుగా విమర్శలు చేయడమే కాకుండా సోషల్ మీడియాలో క్లారిటీ ప్రయత్నం చేశారు. కానీ ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో కేటీఆర్ ఆత్మ రక్షణలో పడిపోయినట్టుగానే తెలుస్తోంది. వాస్తవానికి కేటీఆర్ మాట్లాడే మాటలను ఆ పార్టీ సోషల్ మీడియా ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుంది. కానీ ఇప్పుడు కేటీఆర్ పై విమర్శలు వచ్చినా సరే ఆయన స్పందించకపోవడంతో ఏ విధంగా వెనకేసుకుని రావాలో అర్థం కాని పరిస్థితిలో ఆ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.