Tuesday, October 28, 2025 04:20 AM
Tuesday, October 28, 2025 04:20 AM
roots

చంద్రయ్య, సుబ్బయ్య మనుషులు కాదా జగన్..?

సాధారణంగా రాజకీయ నాయకులు.. తమకి అనుకూలంగా మాట్లాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది నాయకులు మాత్రం ఏదైనా మాట్లాడే ముందు గతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా వైసీపీ నేతలు నీతి వ్యాఖ్యలు, విలువల గురించి, మానవత్వం గురించి మాట్లాడే ముందు గతంలో జరిగిన పరిణామాలు గురించి ఓసారి ఆలోచించుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న మాట.

Also Read :ఇప్పుడేం వద్దు.. చంద్రబాబు, పవన్ కీలక నిర్ణయం..?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంత మందిని అత్యంత భయంకరంగా అంతమొందించిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో కూడా చాలా చోట్ల హత్య రాజకీయాలు జరిగాయి. నందం సుబ్బయ్య, చంద్రయ్య వంటి దారుణ హత్యలతో పాటుగా కర్నూలు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున హత్యాకాండ కొనసాగింది. చివరకు ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఈ రాజకీయాలకు వైసీపీ అప్పట్లో తెరలేపింది.

Also Read :జగన్ పై అనిత సంచలన కామెంట్స్.. వాట్సాప్ మెసేజ్ లపై కీలక వ్యాఖ్యలు 

ఇక ఇప్పుడు రాప్తాడు లో జరిగిన ఘటన విషయంలో కూటమి ప్రభుత్వాన్ని.. స్థానిక ఎమ్మెల్యేని. అలాగే టిడిపి నాయకులను దోషులుగా చూపించే ప్రయత్నం వైసీపీ చేస్తోంది. ఇక మానవత్వం గురించి, పోలీసులు నిర్వహించాల్సిన విదుల గురించి వైసీపీ నేతలు సోషల్ మీడియాతో పాటుగా మీడియా సమావేశాల్లో కూడా నీతి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పట్లో జరిగిన ఘటనల గురించి కనీసం మీడియా సమావేశాలు కూడా ఏర్పాటు చేయని వైసిపి నేతలు.. ఇప్పుడు మాత్రం మానవత్వం అంటూ మీడియా ముందుకు వచ్చేస్తున్నారు.

Also Read :బీ కేర్ ఫుల్.. జగన్‌కు మాస్ వార్నింగ్..!

పలు ఘటనలు జరిగిన సందర్భంగా కొంత మంది వైసీపీ నేతలు అప్పట్లో వెటకారంగా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి వైసిపి ఇప్పుడు రాప్తాడులో జరిగిన ఘటన విషయంలో కూటమి ప్రభుత్వాన్ని దోషిగా చూపించేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఇదే సమయంలో పోలీసులను కూడా జగన్ టార్గెట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు అనేది రఘురామకృష్ణంరాజు వ్యవహారం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.

Also Read :క్యాబినెట్ విస్తరణ.. అది జరిగినప్పుడు చూద్దాం..!

మరి వాటిని వైసిపి ఏ విధంగా మర్చిపోయింది అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. తమకు అనుకూలంగా లేని గ్రామాల విషయంలో కూడా రోడ్లు వేయకుండా కక్ష సాధింపు చర్యలకు అప్పట్లో వైసీపీ నేతలు దిగారు. రోడ్లకు అడ్డంగా గోడ కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన రచ్చ ఇప్పటికీ సోషల్ మీడియాలో కనబడుతూనే ఉంటుంది. మరి వీటిని మర్చిపోయి జగన్ ఏ విధంగా మాట్లాడారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం కలిగించే అంశం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్