Friday, September 12, 2025 08:48 PM
Friday, September 12, 2025 08:48 PM
roots

సాయన్న సాయం ఏది…? ఢిల్లీ ఎందుకు పోవట్లేదు రెడ్డి గారూ…

సాయన్న ఢిల్లీలో ఉంటే బోర్డర్ లో ఆర్మీ ఉన్నట్టు… సాయన్న పార్లమెంట్ లో అడుగుపెట్టిండు అంటే సర్జికల్ స్ట్రైక్ చేసినట్టు… సాయన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తిరుగుతున్నడంటే శత్రుదేశంలో రా ఏజెంట్ తిరిగినట్టే… ఇది వైసీపీ నేతలకు, కార్యకర్తలకు రాజ్యసభ విజయసాయి రెడ్డి పని తీరుపై ఉన్న నమ్మకం. తమ అధినేతకు నమ్మిన బంటు… ఆయన ఢిల్లీలో ఉంటే జగన్ పై బెంగళూరులో ఉన్నా పులివెందులలో ఉన్నా తాడేపల్లిలో ఉన్న ఈగ కూడా వాలదు. వాలే సాహసం చేసే ఛాన్స్ కూడా ఉండదు.

ఆ రేంజ్ లో ఉండేది సాయన్న పని తీరు. కాని ఏమైందో ఏమో సాయన్న ఢిల్లీ పోవట్లేదు ఈ మధ్య కాలంలో. అసలు వైజాగ్ లో ఉన్నడా, హైదరాబాద్ లో ఉన్నడా, ఢిల్లీలోనే ఉన్నడా అనే క్లారిటీ టీడీపీకే కాదు వైసీపీకి కూడా లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ లు అయితే వస్తున్నై. కాంగ్రెస్ కు దగ్గర కావడానికి మస్త్ గ ట్రై చేసిన సాయన్న… మల్లిఖార్జున ఖర్గేకి హ్యాపీ బర్త డే కూడా చెప్పిండు. ఆ తర్వాత జగన్ ఢిల్లీ వెళ్ళిన సమయంలో అఖిలేష్ యాదవ్ ను ధర్నాకు తెచ్చిండు గాని… కాంగ్రెస్ నేతలను తోలుకరాలేకపోయిండు.

సాయన్నకు తన పని మీద నమ్మకం ఎక్కువ. అందుకే రాజ్యసభ ఎంపీ కాంగనే… సొంత జేబులోని పైసలు తీసి కేంద్రం ఇచ్చే ఇంటిని 5 కోట్లు కర్సు చేసి బాగు చేయించిండు. గత అయిదేండ్లలో జగన్ తోని విభేదాలు అచ్చినంక పెద్దగా తాడేపల్లి కూడా వెళ్ళేటోడు కాదు. అధికారం కోల్పోయినంక సాయిరెడ్డి విలువ తెల్సుకున్న జగన్… దగ్గర చేసుకునే ప్రయత్నం చేసినా… ఢిల్లీలో లాబియింగ్ పెద్దగా నడుస్థలేదు సాయన్నకు. లాబియింగ్ లో కింగ్ అయిన సాయన్న… అప్పట్లో డిన్నర్లు, లంచ్ మీటింగ్ లు అంటూ ఇంట్లోనే ఖరీదైన విందు భోజనాలు ఏర్పాటు చేసేటోడు ఢిల్లీల.

కాని ఇప్పుడు అవేం కానోస్తలే. యాడున్నడో తెలియదు ఏం చేస్తున్నడో తెలియదు. మాములుగా సుప్రీం కోర్ట్ లో ఏదైనా కేసు నడుస్తుంటే ఢిల్లీలోనే ఓ కన్నేసుకుని ఉండే సాయన్న… లడ్డు కల్తీ యవ్వారం సుప్రీం కోర్ట్ లో ఉన్నా… పెద్దగా అటు వైపు పోయే ప్రయత్నం కూడా చేయలే. వైవీ సుబ్బారెడ్డి వేసిన కేసు కాబట్టి పోలే అంటున్నరు వైసీపీ నేతలు. ఎవరెన్ని చెప్పినా… సాయన్న ఉన్నన్నాళ్ళు జగన్ ధీమాగా ఉండే. కాని ఇప్పుడు కథ మారింది. సాయన్నను దూరం చేసుకున్నరో ఆయనే భయపడుతున్నడో… ఉలుకు పలుకు లేకుండా పోయిండు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్