Wednesday, October 22, 2025 06:16 PM
Wednesday, October 22, 2025 06:16 PM
roots

జోగి రమేష్ సంగతేంటి..? ఇంకెందుకు ఆలస్యం..?

ఆంధ్రప్రదేశ్ కల్తీ మద్యం కేసు వెనకడుగు పడుతోందా..? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. రాజకీయంగా అత్యంత సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన నిందితుల కంటే మరి కొంత మంది కీలకంగా వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యవహారాన్ని నడిపారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనితో ఈ కేసులో కీలక వ్యక్తుల పాత్రపై సిట్ దర్యాప్తు వేగవంతం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని అరెస్టుల విషయంలో మాత్రం ముందు అడుగు పడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Also Read : డీఎంకే నేతలతో కలిసి వైసీపీ కల్తీ వ్యాపారం..?

ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేసే అవకాశం కనపడటం లేదని తెలుస్తోంది. ఈ కేసులో జోగి రమేష్ పాత్ర కీలకమని ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు ఓ వీడియోలో సంచలన కామెంట్స్ చేసారు. ఆ తర్వాత వాళ్ళు చాటింగ్ చేసుకున్నట్లు కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత జోగి రమేష్.. అసలు తనకు, జనార్దన్ రావుకు పరిచయం లేదని, ఆయనను ఎప్పుడూ చూడలేదని కామెంట్ చేశారు. ఆ తర్వాత పలు ఫొటోలు వీళ్ళ విషయంలో వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాతి నుంచి తనకు ఏ సంబంధం లేదంటూ ఇంటర్వూలు ఇవ్వడం మొదలు పెట్టారు.

Also Read : పర్యటన తెచ్చిన తంటాలు..!

మిగిలిన నిందితులను వేగంగా అరెస్టు చేసిన పోలీసులు.. జోగి విషయంలో ఆధారాలు ఉన్నాసరే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. జోగి, గతంలో చేసిన కార్యాకలాపాలకు సంబంధించి కూడా కేసులు నమోదు చేసేందుకు పోలీసులు ముందుకు అడుగు వేయడం లేదు. నారా వారి సారా అంటూ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసినా సరే పోలీసులలో గాని ప్రభుత్వంలో గాని చలనం కనపడటం లేదు. పోలీసులు సీరియస్ గా దృష్టి సారించి వేగం పెంచితే.. జోగి పాత్రపై పక్కా ఆధారాలు సేకరించడం పెద్ద కష్టం కాదు. అయినా సరే పోలీసు శాఖ నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

బ్రేకింగ్: డీఎస్పీకి అండగా...

తెలుగు రాష్ట్రాల్లో జూదం, కోడి పందాలు...

ఎమ్మెల్యే బావమరిదిని కంట్రోల్...

రాజకీయ నాయకుల అవినీతి వ్యవహారాల విషయంలో...

డీఎంకే నేతలతో కలిసి...

ఆంధ్రప్రదేశ్ కల్తీ మధ్య వ్యవహారానికి, తమిళనాడు...

పర్యటన తెచ్చిన తంటాలు..!

ఒక పర్యటన ఇప్పుడు సిక్కోలు జిల్లా...

శ్రీలేఖకు టీడీపీ క్యాడర్...

రాజకీయాల్లో ప్రభుత్వ అధికారుల పాత్ర కాస్త...

పోల్స్