ఏపీలో ఇప్పుడు పదవుల కేటాయింపులు విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల కేటాయింపులపై రెండో జాబితా కూడా కూటమి సర్కార్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒక పదవిపైనే పడింది. అదే మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి. తెలుగుదేశం పార్టీ హయాంలో నన్నపనేని రాజకుమారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇక వైసీపీ ప్రభుత్వంలో వాసిరెడ్డి పద్మ కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆ పదవి ఎవరికి కేటాయిస్తారనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది. Who is Next Chairman అంటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : ఏందన్నా ఇది… సిగ్గుగా లేదా..?
ఇందుకు ప్రధాన కారణం.. మహిళా కమిషన్ ఛైర్మన్ అనే పదవికి ప్రొటోకాల్ ఉంటుంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలు కూడా మహిళా కమిషన్‌కు జవాబుదారీగా ఉండాల్సిందే. ఇక ప్రస్తుతం ఏపీలో మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయని… ఇప్పటికే వైసీపీ నేతలు గగ్గొలు పెడుతున్నారు. అలాగే మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందనేది ప్రభుత్వ వాదన. ఇక మహిళా కమిషన్ పరిధిలోకే కళాశాలలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, మహిళా రక్షణ, మహిళలకు స్వయం ఉపాధి వంటివి కూడా చేరుతాయి. దీంతో మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవి కోసం పోటీ ఎక్కువగానే ఉంది.
వాస్తవానికి తొలి నుంచి మహిళా కమిషన్ కోసం పార్టీలో ప్రధాన నేతలంతా పోటీ పడ్డారు. పనబాక లక్ష్మి, పీతల సుజాత, ఆచంట సునీత, కావలి గ్రీష్మ, ఉండవల్లి శ్రీదేవి వంటి నేతలు గట్టిగానే ప్రయత్నించారు. అయితే వీరిలో పనబాక లక్ష్మికి టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారు. పీతల సుజాత, ఉండవల్లి శ్రీదేవి, కావలి గ్రీష్మలను కార్పొరేషన్ ఛైర్మన్లుగా చంద్రబాబు ప్రకటించారు. ఆచంట సునీతకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి రాలేదు. అయితే ఇప్పుడు మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కోసం మరో బీసీ నేత పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : అసెంబ్లీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన అయ్యన్న
ఈ పదవిని తన సోదరి ఆదిరెడ్డి భవానికి ఇవ్వాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కోరుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన భవానీ స్థానంలో ఆమె భర్త శ్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్యే. అయితే ఇప్పటికే కింజరాపు కుటుంబంలో ఒక కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇవి కాక మళ్లీ కేబినెట్ ర్యాంక్ ఉన్న మహిళా కమిషన్ ఛైర్మన్ పదవి కూడా కోరుతున్నారు. దీంతో ఈ పదవి కోసం ఇప్పుడు పెద్ద ఎత్తున పోటీ జరుగుతోంది. అందుకే కీలకమైన కార్పొరేషన్‌లన్నీ ప్రకటించిన కూటమి ప్రభుత్వం… మహిళా కమిషన్ ఛైర్మన్ పదవిని మాత్రం హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.