Saturday, September 13, 2025 03:08 AM
Saturday, September 13, 2025 03:08 AM
roots

తర్వాతి అరెస్ట్ ఆ ఐపిఎస్..? పీఎస్ఆర్ ఏం చెప్పారు..?

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ముంబై హీరోయిన్ జత్వాని విషయంలో అప్పటి పోలీసు అధికారులు అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం మారిన తర్వాత వారిపై చర్యలకు రంగం సిద్దం చేసారు. ముగ్గురు ఐపిఎస్ అధికారులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఐపిఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు ను పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మరికొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read : కర్రెగుట్టల్లో యుద్దమే.. రంగంలోకి 24 వేల మంది బలగాలు

ఇదిలా ఉంచితే ఈ విచారణ కీలక దశకు చేరుకుంది. ముంబయికి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీ, ఆమె తల్లిదండ్రులపై అక్రమ కేసు బనాయించి వేధించిన కేసులో నిందితు లైన నాటి విజయవాడ నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా తాతా (ఏ3), డీసీపీ విశాల్ గున్ని (ఏ6)లకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మే 5వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చారు. ఇదే కేసులో అరెస్టయిన పీఎస్ఆర్ ఆంజనేయులు (ఏ2)ను సీఐడీ అధికారులు 2 రోజులపాటు విచారించిన సంగతి తెలిసిందే.

Also Read : చంద్రబాబు “మైక్రోసాఫ్ట్” స్ట్రాటజీ వర్కౌట్ అయిందా..?

ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటూ దాటవేత ధోరణిలోనే జవాబులివ్వటంతో మరింత లోతుగా ఆరా తీసేందుకు కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలను విచారించాలని సీఐడీ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో వీరిద్దరినీ సీఎంవోకు పిలిపించి.. జెత్వానీని అరెస్టు చేయాలని పీఎస్ఆర్ ఆంజనేయులే ఆదేశించారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు విశాల్ గున్ని. తాను అలాంటి ఆదేశాలివ్వలేదని పీఎస్ ఆర్ తాజాగా సీఐడీ విచారణలో చెప్పడంతో వారికి నోటీసులు జారీ చేసారు. ఇంటిలిజెన్స్ చీఫ్ గా మాత్రమే తాను ఏదైనా అంశంపై మాట్లాడి ఉంటానని ఆయన చెప్పిన సమాధానాల ఆధారంగా కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలను సీఐడీ ప్రశ్నించనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్