Monday, October 27, 2025 04:30 PM
Monday, October 27, 2025 04:30 PM
roots

తెలంగాణలో బొగ్గు బయటపెట్టింది రామ భక్తుడా..? పొయ్యితో బయటపడ్డ బొగ్గు నిల్వలు..!

మనకు తెలంగాణ అనగానే సింగరేణి సంస్థ, బొగ్గు ఉత్పత్తి గుర్తుకొస్తుంది. దేశంలోనే అత్యధిక బొగ్గు నిల్వలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి వివిధ రాష్ట్రాలకు బొగ్గును ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అయితే ఈ బొగ్గు అసలు తెలంగాణలో ఎలా గుర్తించారు..? ఎప్పుడు బొగ్గు బయటపడింది..? సింగరేణి సంస్థ ఎప్పుడు ఆవిర్భవించింది..? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. తెలంగాణ రూపురేఖల్ని మార్చేసిన ఈ సింగరేణి సంస్థ ఆవిర్భావం తర్వాత దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది.

Also Read : అలాంటి వారితోనే టీడీపీకి ప్రమాదం..!

ఒకప్పుడు బొగ్గుతో నడిచే రైళ్లకు తెలంగాణ నుంచి వెళ్లిన బొగ్గు ఆధారం అయ్యేది. అలాగే బొగ్గు ఆధారిత విద్యుత్ పరిశ్రమలకు కూడా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున బొగ్గు తరలించేవారు. అసలు ఈ బొగ్గును ఎప్పుడు..? ఎక్కడ గుర్తించారో చూద్దాం. 1870 ప్రాంతంలో ఇల్లెందులో బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. భద్రాచలం రాములవారిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ కుటుంబం, ఎడ్ల బండి పై ప్రయాణం చేసే క్రమంలో ఇల్లందు వద్ద ఉన్న పూసపల్లి గ్రామంలో ఆగి వంట చేసుకుంది. ఈ క్రమంలో చుట్టూ ఉన్న రాళ్లను పేర్చి ఒక పొయ్యిగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పుల్లలతో పాటు నల్లగా ఉన్న రాళ్లు కూడా మంటకు అంటుకున్నాయి.

Also Read : బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు ప్రైవేటు ట్రావెల్స్ సడెన్ షాక్

వాటిని ఆర్పే ప్రయత్నం చేసిన సరే ఆరలేదు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బ్రిటిష్ అధికారి విలియం కింగ్ అక్కడ బొగ్గు ఉందని గుర్తించి తవ్వకాలు మొదలుపెట్టారు. తొలుత హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ 1889లో అక్కడ బొగ్గు తవ్వకాలు మొదలుపెట్టింది. అక్కడినుంచి మెల్ల మెల్లగా సాగిన బొగ్గు ఉత్పత్తి 1928లో సింగరేణి సంస్థ ఆవిర్భవించిన తర్వాత పెద్ద ఎత్తున తవ్వకాలు మొదలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, అదిలాబాద్ జిల్లాలలో భూగర్భ, ఉపరితల మైనింగ్ కు శ్రీకారం చుట్టారు. ఇటీవల తెలంగాణ సమీపంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చింతలపూడి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున బొగ్గు ఉందని గుర్తించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

ఆర్టీసీ బస్సు తప్పింది.....

కర్నూలు రోడ్డు ప్రమాదం ఘటన విషయంలో...

బుకింగ్ క్యాన్సిల్.. ప్రయాణికులకు...

సాధారణంగా ఏదైనా అనుకోని అగ్ని ప్రమాదం...

పోల్స్