Friday, September 12, 2025 07:12 PM
Friday, September 12, 2025 07:12 PM
roots

కిరణ్ ఓకే.. మరి వాళ్ళను ఎందుకు వదిలేసినట్టు..?

ఆంధ్రప్రదేశ్ లో గత అయిదేళ్లుగా.. మీడియా సమావేశాల్లో గాని సోషల్ మీడియాలో గాని వినకూడని బూతులను, చూడకూడని సన్నివేశాలను ప్రజలు చూసిన మాట వాస్తవం. ఏ దేశంలో కూడా బహుసా ఈ తరహా రాజకీయ పరిస్థితులు ఉండేవేమో అనే భావన కూడా చాలా మందిలో కలిగింది. సోషల్ మీడియాలో అయితే.. టీడీపీ, జనసేన పార్టీల అధినేతల కుటుంబాలను, వ్యక్తిగతంగా అనేక విధాలుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అందరూ భావించారు.

Also Read : పోల్ : 2025 లో ఏ హీరో సినిమా కోసం మీరు ఎదురు చూస్తున్నారు?

వందల మంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేవలం.. పదుల సంఖ్యలో అరెస్ట్ లు జరిగిన మాట వాస్తవం. మహిళలను, చిన్నారులను వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వైసీపీ క్యాడర్ మాట్లాడింది. కాని వారిలో అందరినీ అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. కట్ చేస్తే.. తాజాగా టీడీపీ కార్యకర్త కిరణ్.. అభ్యంతరకరంగా మాట్లాడాడని అరెస్ట్ చేసారు. దీనిపై టీడీపీ సోషల్ మీడియాలో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కిరణ్ కంటే అత్యంత దారుణంగా మాట్లాడిన వారిపై తీసుకున్న చర్యలు ఏంటీ అని నిలదీస్తున్నారు.

Also Read : సొంత కార్యకర్తపై టిడిపి కఠిన చర్యలు.. ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు?

నాయకుల్లో గోరంట్ల మాధవ్, రోజా, కొడాలి నానీ వంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదనే ప్రశ్న వినపడుతోంది. ఇక అనితా రెడ్డి, ఇప్పాల రవీంద్రా రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి వంటి వారిని ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పాలనే ప్రశ్నలు వినపడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ను అత్యంత దారుణంగా మాట్లాడిన వారిని ఎందుకు లైట్ తీసుకున్నారో చెప్పాలని కూడా టీడీపీ సోషల్ మీడియా నిలదీస్తోంది. కిరణ్ మాట్లాడింది తప్పు అయినప్పుడు.. అంతకంటే దారుణంగా మాట్లాడిన వారిని సాక్ష్యాలు ఉన్నా సరే ఎందుకు వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్