Friday, September 12, 2025 09:05 PM
Friday, September 12, 2025 09:05 PM
roots

నా జోలికి వస్తే తాట తీస్తా..!

ఏపీలో వైసీపీ పరిస్థితి నానాటికి దారుణంగా తయారవుతోంది. ఎవరైతే జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్నారో.. ఇప్పుడు వారంతా నీకో దండం సామి అని చెప్పేసి దూరంగా పారిపోయారు. ఒకరిద్దరు మినహా దాదాపు అంతా ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారే. జగన్‌కు అత్యంత ఆప్తుడు, అక్రమాస్తుల కేసులో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసేశారు. తొలి రోజుల్లో కాస్త సైలెంట్‌గా ఉన్న సాయిరెడ్డిని వైసీపీ నేతలు ప్రతి విషయంలో కెలుకుతున్నారు. దీంతో ఆయన ఇప్పుడు టార్గెట్ వైసీపీ అన్నట్లుగా రంగంలోకి దిగారు. టార్గెట్ వైసీపీ అన్నట్లుగా సాయిరెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. నీ బంఢారం మొత్తం బయటపెడతా అని మాస్ వార్నింగ్ ఇస్తున్నారు సాయిరెడ్డి.

Also Read : కాకాణి అరెస్ట్.. వైసీపీలో కలవరం..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రధానంగా వైసీపీకి, రాజ్యసభకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సాయిరెడ్డి.. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కూడా ప్రకటించారు. ఇకపై వ్యవసాయం చేసుకుంటా అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున ముందుగా గుండెపోటు అని ప్రకటించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆ తర్వాత గొడ్డలి పోటుతో హత్య చేశారని కూడా చెప్పారు. అదే సమయంలో వివేకానంద రెడ్డిని చంద్రబాబు హత్య చేయించారని ఆరోపించారు కూడా. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. చివరికి నారా సుర రక్తచరిత్ర అంటూ సాక్షి పత్రికలో తప్పుడు వార్త కూడా ప్రచురించారు.

Also Read : వంశీ మరణం.. పేర్ని సంచలన కామెంట్స్

ఇక సీబీఐ విచారణ ప్రారంభమైన తర్వాత అసలు హంతకులు ఎవరో తేలిపోయింది. ఇదే హత్య కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే.. ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. ఇదే విషయంపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గుండెపోటు ప్రకటన చేసే ముందు తనకు అవినాష్ రెడ్డి ఫోన్ చేశాడని.. అతను చెప్పిన మాటనే మీడియా ముందు చెప్పినట్లు సాయిరెడ్డి స్పష్టం చేశారు. ఇలా అవినాష్‌ను ఇరికించారు సాయిరెడ్డి. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ కేసులో సాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. ఆ సమయంలో కూడా లిక్కర్ స్కామ్‌ విషయంలో ఎంపీ మిధున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డితో పాటు మరికొందరు కూడా రెండుసార్లు సమావేశమయ్యారని సాయిరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. దీంతో లిక్కర్ స్కామ్ జరిగినట్లు అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత నుంచి సాయిరెడ్డిని టార్గెట్ చేశారు వైసీపీ నేతలు.

Also Read : వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు..!

రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ కూడా సాయిరెడ్డిని అమ్ముడుపోయిన వ్యక్తి అంటూ వ్యాఖ్యానించారు. ఆ తెల్లారే సాయిరెడ్డి టీడీపీ నేత టీడీ జనార్థన్‌తో సమావేశమయ్యాడంటూ సోషల్ మీడియాలో వైసీపీ ఓ వీడియో విడుదల చేసింది. టీడీ జనార్థన్‌తో సాయిరెడ్డి భేటీ అయ్యారని.. ఆయన చెప్పినట్లుగానే లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారని కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. దీనిపై సాయిరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. తన జోలికి వస్తే తాటా తీస్తా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాను మౌనంగా ఉండటం వైసీపీలో కోటరీకి నచ్చటం లేదన్నారు. అందుకే తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సాయిరెడ్డి. తాను నోరు విప్పితే జగన్‌కు నష్టం జరుగుతుందని కూడా హెచ్చరించారు. జగన్ చుట్టూ చేరిన కోటరి చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 అని చెప్పుకునే వారు ప్రాధాన్యత పెంచుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. తనను బలిపశువును చేసేందుకు కోటరి ప్రయత్నం చేస్తోందని.. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు.

Also Read : సంక్షేమానికి కొత్త నిర్వచనం ఎన్టీఆర్..!

ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఇంటికి వెళ్లిన మాట వాస్తవమే అని ఒప్పుకున్న సాయిరెడ్డి.. ఆ కుటుంబంతో 20 ఏళ్లు పైగా తనకు అనుబంధం ఉందన్నారు. శేషగిరిరావు ఇంట్లో తానున్న సమయంలోనే టీడీ జనార్థన్ అక్కడికి వచ్చారని.. ఆ విషయం తనకు ముందుగా తెలియదన్నారు. తమ మధ్య ఎలాంటి రాజకీయ పరమైన చర్చలు జరగలేదని కూడా సాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తనకు ఎవరితో రహస్య సంబంధాలు లేవన్న సాయిరెడ్డి… కలవాలనుకుంటే.. చంద్రబాబును, లోకేష్‌ను, పవన్ కల్యాణ్‌ను కూడా బహిరంగంగానే కలుస్తానని.. మధ్యవర్తులతో తనకు పని లేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాల్లో లేనని.. ఎవరితో కూడా ఎలాంటి రాజకీయ పరమైన చర్చలు జరపటం లేదని సాయిరెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్