Tuesday, October 28, 2025 07:07 AM
Tuesday, October 28, 2025 07:07 AM
roots

బిజెపి పెద్దలతో విజయసాయి బిజీ బిజీ.. ఏపీలో ఏమి జరగబోతుంది?

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మళ్ళీ జగన్ కోసం పని మొదలుపెట్టారా..? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం కోసం ఆయన నానా కష్టాలు పడుతున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నిమిత్తం విజయసాయి రెడ్డి ఢిల్లీ లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆయన సభలో ప్రజా సమస్యల పై చర్చించడం కంటే పలువురు కీలక నేతలను కలిసి తమ వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుని పనిలో బిజీగా ఉంటున్నారు. ఎలా అయినా మళ్ళీ బిజెపి పెద్దలను దగ్గర చేసుకోవాలని విజయసాయి రెడ్డి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తుంది.

Also Read : Breaking News: కీలక కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్?

ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఏదో జరుగుతుందని చెప్పే ప్రయత్నం ఆయన బలంగా చేసారు. ఇక అప్పటి నుంచి ఢిల్లీ లోనే ఉన్న విజయసాయి రెడ్డి… కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారి తీసింది. అమిత్ షాను ప్రసన్నం చేసుకుని రాష్ట్రంలో పరిస్థితి తమకు అనుకూలంగా మార్చుకోవాలని విజయసాయి ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారట.

అలాగే కేసుల నుంచి బయటపడటం కోసం కూడా విజయసాయి తీవ్రంగా కష్టపడుతున్నారని సమాచారం. ముఖ్యంగా తెలంగాణా హైకోర్ట్ లో రోజువారి విచారణ జరగడంతో ఇప్పుడు జగన్ లో కలవరం మొదలయింది. అందుకే ఇప్పుడు విజయసాయి ఢిల్లీ వేదికగా బిజెపి పెద్దలని ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నట్లు తెలుస్తుంది. అమిత్ షా ని కలిసిన ఫోటో ని ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసారు. దీనితో ఒక్కసారి రాజకీయ వర్గాల్లో కలవరం రేగింది. మళ్ళీ ఏదో జరగబోతుందనే చర్చ మొదలైంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్