Wednesday, September 10, 2025 01:14 AM
Wednesday, September 10, 2025 01:14 AM
roots

రేపే ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఇవే లెక్కలు..

ఎంతో ఆసక్తి రేపిన ఉప రాష్ట్రపతి ఎన్నిక చివరి దశకు చేరుకుంది. జగదీప్ దంఖర్ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని ఉప ఎన్నిక ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిపై ప్రతిపక్షాలు సైతం సీరియస్ గా ఫోకస్ చేసాయి. నేడు ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రేపు పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్‌ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై ప్రతిపక్ష ఎంపీలకు నేడు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 నిమిషాలకు సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో ‘మాక్‌ పోల్‌’ ఏర్పాటు చేసారు.

Also Read : పవన్ కు ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు

రాత్రి 7.30 నిమిషాలలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రతిపక్ష ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. సెప్టెంబర్‌ 9న జరిగే ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్‌, ఇండియా బ్లాక్‌ ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్‌ రెడ్డి మధ్య జరగనున్న ప్రత్యక్ష పోటీ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్‌ అధికారిగా రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌ పిసి మోడీ వ్యవహరిస్తున్నారు. మంగళవారం పార్లమెంట్‌ హౌస్‌లోని వసుధలోని రూమ్‌ నెంబర్‌ ఎఫ్‌-101లో పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Also Read : భారీ బడ్జెట్ కు గుడ్ బై..

సెప్టెంబర్‌ 9న ఉదయం 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఆ తరువాత వెంటనే ఫలితం ప్రకటించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లను కూడా ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ఉపరాష్ట్రపతికి జరిగే ఎన్నికల్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటు వేయనున్నారు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్టోరల్‌ కాలేజీలో రాజ్యసభకు ఎన్నికైన 233 మంది సభ్యులు ఉండగా.. ప్రస్తుతం ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. రాజ్యసభకు నామినేటెడ్‌ 12 మంది సభ్యులు ఉండగా లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. ఎలక్టోరల్‌ కాలేజీలో మొత్తం 788 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఓటు హక్కును 781 మంది ఎంపీలు వినియోగించుకుంటారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఈవీఎంలా..? బ్యాలెట్టా..? చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో...

ఓజీ కోసం.. చీఫ్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా...

దుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు..!

దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీలాద్రి...

జగన్‌కు షాక్.. వైసీపీలో...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వరుస...

మాకు ఈ పదవులు...

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర...

గ్లాస్ స్కై వాక్...

ఏదైనా మంచి జరిగితే.. అది మా...

పోల్స్