ఏపీలో ఎమ్మెల్సీ పదవులు సందడి ముగిసింది. అయితే ఆశించిన వాళ్ళు మాత్రం ఇంకా బాధలోనే ఉన్నారు. పార్టీ అధిష్టానం కోరిక మేరకు సీట్లు వదులుకున్న కొంతమంది కీలక నాయకులు ఇప్పుడేం చేస్తారు.. అనేదే ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో ఇటువంటి పరిణామాలు సర్వసాధారణం. కానీ టిడిపిలో కొంతమంది కీలక నేతలు ఇప్పుడు పదవుల విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి.
Also Read : కార్తీక్ ఆర్యన్ తో శ్రీ లీల డేటింగ్ నిజమేనా..?
అందులో ముఖ్యంగా వంగవీటి రాధా గత కొన్ని రోజులుగా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఆయనకు సీటు రాలేదు. కొన్ని కారణాలతో వంగవీటి రాధను కేవలం ప్రచారానికి మాత్రమే టిడిపి పంపించింది. ఇక ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆశించినా… ఇప్పటివరకు ముందు అడుగు పడలేదు. అయితే భవిష్యత్తులో 23 స్థానాలు ఖాళీ అవుతాయి. వాటిలో ఒక స్థానాన్ని రాధకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
Also Read : తెలంగాణ అసెంబ్లీలో కుల చిచ్చు
అయితే తాజాగా ఖాళీ అయిన ఐదు స్థానాల్లో ఒక స్థానం నుంచి.. వంగవీటి రాధ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆయనకు ఆ సీటు కేటాయించలేదు. దీనితో వంగవీటి రాధా భవిష్యత్తులో ఏం చేయబోతారనేదే ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరిగినా… దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వంగవీటి రాధ విడుదల చేయలేదు. ఇక మరో నేత దేవినేని ఉమా కూడా మైలవరం సీటు త్యాగం చేశారు. ఆయన భవిష్యత్తుపై కూడా ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఆయనకు గుర్తింపు ఉంది.
Also Read : జగన్‌ను ఆడిస్తున్నది ఎవరూ..?
మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో.. దేవినేని ఉమా కు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఇక ఆయన ఈసారి ఎమ్మెల్సీగా చట్టసభలలో అడుగుపెట్టడం ఖాయం అని ఎదురు చూశారు దేవినేని అభిమానులు. కానీ అది కూడా ఖరారు కాలేదు. దీనితో దేవినేని ఉమా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. 2019 నుంచి 2024 వరకు వైసిపి ఆయనను గట్టిగానే ఇబ్బంది పెట్టింది. ఇక పార్టీ వచ్చిన తర్వాత కూడా అధిష్టానం ఆశీస్సుల కోసం ఉమా కష్టపడుతూనే ఉన్నారు. అయినా సరే ఇప్పటివరకు ఆయనకు ఎటువంటి పదవి దక్కకపోవడంతో దేవినేని ఉమా ఏం చేయబోతున్నారనేది చూడాలి. అటు నియోజకవర్గంలో కూడా ఉమాకు ప్రాధాన్యత క్రమంగా తగ్గుతుంది.