Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

వంశీ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ విషయంలో కృష్ణా జిల్లా పోలీసులు ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదు చేసారు. అటు కోర్ట్ కూడా వంశీ వ్యవహారాలను సీరియస్ గా తీసుకుంటూ వస్తోంది. గన్నవరం పార్టీ ఆఫీస్ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అటు భూ కబ్జా కేసులను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు.

Also Read : ఇంటరెస్టింగ్ గా టెస్ట్ టీం సెలెక్షన్.. కొత్త ఆటగాళ్ళు ఎవరు..?

ఇదిలా ఉంచితే తాజాగా సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు చార్జ్ షీట్ దాఖలు చేసారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు… టీడీపీ కార్యాలయంపై దాడి కేసును నిర్వీర్యం చేసేందుకు సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేశారని చార్జ్ షీట్ లో ప్రస్తావించారు. కిడ్నాప్ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేయగా మరో ఆరుగురు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో 59 మందిని సాక్షులుగా ఉన్నారని చార్జ్ షీట్ లో వివరించారు.

Also Read : స్కాంలో లేము.. కేసిరెడ్డి టు కృష్ణమోహన్ రెడ్డి.. ఎవరిని ఇరికిస్తున్నట్టు..?

కేసులో నిందితులపై గన్నవరం, అత్కుర్, హనుమాన్ జంక్షన్ పోలీసు స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని.. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి టీడీపీ కార్యాలయంపై దాడి కేసును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారని పోలీసులు పేర్కొన్నారు. కేసు వెనక్కి తీసుకుంటున్నట్లు అఫిడవిట్ పై సంతకాలు తీసుకున్నారని.. కోర్టుకు తీసుకొచ్చి న్యాయస్థానం ఎదుట స్టేట్ మెంట్ ఇప్పించారని.. విజయవాడ నుంచి బలవంతంగా విశాఖపట్నం , హైదరాబాద్ తరలించారని తెలిపారు. సత్యవర్ధన్ తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయని చార్జ్ షీట్ లో ప్రస్తావించారు పోలీసులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్