గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కోర్ట్. దీనితో వల్లభనేని వంశీని మరో రెండు మూడు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే వంశీ.. గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడి కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. దీనిపై కూడా కోర్ట్ లో వాదనలు జరగనున్నాయి.
Also Read : పథకాల అమలు పై ఫుల్ క్లారిటీ..!
ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు ఆయన తరుపు లాయర్లు. ఈ తరుణంలో వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై వైసీపీ సోషల్ మీడియా లో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స జరుగుతుంది. ఈ రోజు ఉదయం ఆయనను.. పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.
Also Read : బాబు సర్కార్ కీలక నిర్ణయం.. జగన్పై కూడా ఎఫెక్ట్..!
వల్లభనేని వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు పలు సమస్యలకు వైద్య పరిక్షలు నిర్వహించారు. అనారోగ్య కారణాల రీత్యా 20 కేజీల వరకు బరువు తగ్గిన వంశీ.. తాను ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నా అని కోర్ట్ కు వివరించారు. ఇక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బడి పడుతున్నట్లు గుర్తించి జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వంశీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపిన వైద్యులు.. సిటీ స్కాన్ తో పాటు లంగ్స్ సంబంధిత పరీక్షలు నిర్వహించి తిరిగి జైలుకు తరలించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభనేని వంశి. ఇక న్యాయమూర్తి ఆదేశాలతో ఇప్పటికే వంశీకి వరుసగా వైద్య పరీక్షలను చేయిస్తున్నారు జైలు సిబ్బంది.