Saturday, October 25, 2025 11:37 PM
Saturday, October 25, 2025 11:37 PM
roots

ట్రంప్ కు ఏదైనా జరిగితే నేనే.. జెడి వాన్స్ సంచలనం

రెండవ సారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోందా..? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. అమెరికా చరిత్రలో 79 ఏళ్ళ వయసులో బాధ్యతలు చేపట్టిన ఏకైక అధ్యక్షుడు ట్రంప్. ఇటీవల ఆయన అనారోగ్యానికి సంబంధించి మీడియాలో పదే పదే ప్రచారం జరుగుతోంది. వయోభార సమస్యలతో ట్రంప్ బాధ పడుతున్నారు అని కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ సంచలన కామెంట్స్ చేసారు.

Also Read : ఎన్టీఆర్ విత్ నీల్.. మరో ఇద్దరు స్టార్ హీరోలు.. ?

ఏదైనా భయంకర విషాదం సంభవించినప్పుడు అమెరికా కమాండర్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. 4 ఏళ్ళ పదవీ కాలం ట్రంప్ పూర్తి చేస్తారని జెడి వాన్స్ విశ్వాసం వ్యక్తం చేసారు. అమెరికా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ మంచి ఆరోగ్యంగా ఉన్నారని ఆయనకు అద్భుతమైన శక్తి ఉందని కొనియాడారు. మరిన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆయన సిద్దంగా ఉన్నారని జెడి వాన్స్ వెల్లడించారు.

Also Read : అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్..!

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతికి గాయం కనపడింది. జనవరిలో 78 సంవత్సరాల ఏడు నెలల వయసులో, ఈ ఏడాది జనవరిలో ప్రమాణ స్వీకారం చేసారు ట్రంప్. జో బిడెన్ 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాల రెండు నెలల వయసు. అమెరికా చరిత్రలో మూడవ అతి పిన్న వయస్కుడైన ఉపాధ్యక్షుడు వాన్స్. ఉపాధ్యక్షుడు కావడం తనకు చాలా సంతోషంగా ఉందని, 200 రోజుల్లో చాలా నేర్చుకున్నానని అన్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

సస్పెండ్ చేస్తే తిరువూరు...

తిరువూరు నియోజకవర్గం టీడీపీలో అలజడి కొనసాగుతోంది....

పులివెందులకు కేంద్రం గుడ్...

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్...

వరల్డ్ కప్‌కు మేం...

గత నాలుగు నెలల నుంచి భారత...

రోహిత్ రికార్డుల మోత.....

భారత క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓపెనర్...

ఒక్కొక్కరికి కోటి ఇచ్చే...

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాతి...

హైడ్రా కమీషనర్ రంగనాథ్...

హైదరాబాద్‌లోని హైడ్రా కమీషనర్ రంగనాథ్ శుక్రవారం...

పోల్స్