Saturday, September 13, 2025 03:27 AM
Saturday, September 13, 2025 03:27 AM
roots

ఆర్బీఐ సంచలన నిర్ణయం.. యుపిఐ పరిమితి రూ: 5 లక్షలకు పెంపు

ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి రూ.5 లక్షల వరకు ఒకేసారి యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) విధానంలో చెల్లించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) అనుమతినిచ్చింది. ఆదివారం నుంచి ఈ మార్పు అమల్లోకి రానుంది. ఆగస్టు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ‘యూపీఐతో పన్ను చెల్లింపు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచాల’ని ఆర్‌బీఐ నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్‌పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. పెంచిన లిమిట్‌ సాధారణ పేమెంట్లకు కాదు. కేవలం పన్ను చెల్లింపులకు మాత్రమే యూపీఐ లిమిట్‌ను పెంచినట్లు గవర్నర్‌ తెలిపారు. పన్ను చెల్లింపులు బకాయి పడకుండా వెంటనే చెల్లింపులు అయ్యేలా ఆర్‌బీఐ యూపీఐ లిమిట్‌ను రూ.5 లక్షలకు పెంచింది.

RBI Governor Shaktikanta Das

ఆసుపత్రి, విద్యా సంస్థల బిల్లులను ఇదే పద్ధతిలో చెల్లించొచ్చు. ఐపీఓ దరఖాస్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకూ చిన్నపాటి మార్పులతో ఇది వర్తిస్తుంది. యూపీఐ పేమెంట్లు క్యాపిటల్‌ మార్కెట్లు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్స్‌, రుణ చెల్లింపులు, బీమా, వైద్య, విద్యాపరమైన సర్వీసులకు లిమిట్‌ అనేది ఒక్కో రీతిలో ఉంటుంది. పబ్లిక్‌ ఆఫర్‌, రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌, పన్ను చెల్లింపులు రూ.2 లక్షలు: క్యాపిటల్‌ మార్కెట్లు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్స్‌, ఫారిన్‌ ఇన్‌వార్డ్‌ రెమిటెన్సెస్‌ తదితర సేవలు రూ.1 లక్ష: సాధారణ పేమెంట్ల లిమిట్‌. ఈ లిమిట్‌ పెంచే యోచనలో ఆర్‌బీఐ కు లేదని తెలుస్తుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్