కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు వరాలు ప్రకటించారు. నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్… కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. 7.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పది సూత్రాల్లో రెండోది ఎంఎస్ఎంఈ రంగమని ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కానుందని తెలిపారు. 27 రంగాల్లో స్టార్టప్‍లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు ఇవ్వనున్నారు.
Also Read : టీడీపీ పొలిట్‌బ్యూరో మీటింగ్.. ఇవే కీలకం..!
సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు ఇస్తారు. ఎంఎస్ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించామని తెలిపారు. ప్రతి ఇంటికీ రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు విడుదల చేస్తామని తెలిపారు. సీనియర్ సిటీజన్లకు టీడీఎస్ రూ.లక్షకు పెంచుతామన్నారు. సీనియర్ సిటిజన్లకు ట్యాక్స్ బెనిఫిట్ రెట్టింపు చేస్తామని అద్దెలపై టీడీఎస్ రూ. 6 లక్షలకు పెంచుతామన్నారు. రుణాలలో విద్యా రెమిటెన్స్ లపై టీడీఎస్ ఎత్తివేస్తామన్నారు.
Also Read : జంప్ డిపాజిట్… నయా సైబర్ క్రైమ్..!
రెమిటెన్స్ ప్లాన్ కింద టీడీఎస్ పరిమితి రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. కొత్త ఇన్‍కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు చేశారు. వ్యక్తిగత ఆదాయంపై రూ.12 లక్షల వరకు ఇక నుంచి పన్నులు లేవని ప్రకటించారు. రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏళ్ల వ్యవధితో వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు.




