Saturday, September 13, 2025 01:12 AM
Saturday, September 13, 2025 01:12 AM
roots

మింగిన బియ్యం చేపల చెరువులో కక్కిన పేర్ని

మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన రేషన్ బియ్యం గోదాముల్లో మాయమైన బియ్యం విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మాయమైన రేషన్ బియ్యాన్ని వివిధ అవసరాలకు వాడినట్లు పోలీసులు గుర్తించారు. కొంత చేపలకు ఆహారంగా అలాగే మండల స్థాయి ప్రభుత్వ గోదాములో మాయమైన నిలువల స్థానంలో రైస్ మిల్లులో కల్తీకి వినియోగించారని గుర్తించారు. నాని ఇచ్చిన భరోసాతో పలుమార్లు 386 టన్నులకు పైగా బియ్యాన్ని మినీ ట్రక్కుల్లో బయటకు తరలించి వాడేసారు.

Also Read : సంక్రాంతి విన్నర్ బాలయ్యే..!

ఈ కేసులో పోలీసులు తాజాగా మరో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులు రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వారి నుండి రాబట్టిన సమాచారం మేరకు పోలీసులు మరి కొంతమందిని ఈ వ్యవహారంలో బయటకు లాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనే ఈ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న లారీ డ్రైవర్ మంగారావు… రైస్ మిల్లర్ ఆంజనేయులు నుంచి మాత వెంకట సుబ్బారావు, పామర్తి నాగేశ్వరరావు, గోపిశెట్టి నాంచారయ్య, కందుల బాపూజీ, డొక్కు నాగరాజు బియ్యం కొనుగోలు చేసినట్లు పోలీసులు తేల్చారు.

వీరిలో నాగరాజు ఇప్పటికి మృతిచెందగా మరో నలుగురు నిందితులను ఆదివారం సాయంత్రం జిల్లా ప్రత్యేక మొబైల్ కోర్టు అధికారి ముందు హాజరు పరిచారు. వీరికి నెల 24 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తూ దీన్నే వ్యాపారంగా మార్చుకొని కందుల బాపూజీ అనే వ్యక్తి మచిలీపట్నంలో రేషన్ బియ్యం డాన్ గా మారాడని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు నిందితులను ప్రభావితం చేస్తున్నారని పేర్ని నాని పై ఆరోపణలు వినపడుతున్నాయి.

Also Read : వైసీపీకి వరుస అవకాశాలు ఇస్తున్న టిడిపి..!

పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా నిందితులతో ఆయన ఇప్పటికే రహస్యంగా మంత్రాలు జరుపుతున్నారని గుర్తించారు. తాజాగా అరెస్టు అయిన నిందితులు ఆంజనేయులు, మంగరావుకు ఇప్పటికే నాని నుంచి డబ్బులు కూడా ముట్టాయని గుర్తించారు. వారి నుంచి గోదాము మేనేజర్ మానస్ తేజ బ్యాంకు ఎకౌంటుకు 27 లక్షల లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. తేజ నుంచి నానికి 1.76 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయని గుర్తించారు. 386 టన్నులు రేషన్ బియ్యాన్ని మాయం చేయగా మొత్తం ఎంత సొమ్ము చేతులు మారింది అనేది ఇప్పటివరకు స్పష్టత రాలేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్