Monday, October 27, 2025 10:50 PM
Monday, October 27, 2025 10:50 PM
roots

తుంగభద్ర ప్రాజెక్ట్ పై సంచలన నివేదిక

తుంగభద్ర ప్రాజెక్ట్ ఇప్పుడు మూడు రాష్ట్రాలను ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది.. ఓ గేటు కొట్టుకుపోయిన వ్యవహారంతో ఏపీ, కర్ణాటక బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఇక ఏపీ ప్రభుత్వ చొరవతో ప్రాజెక్ట్ లో కొత్త గేటును అమర్చారు. ఇక గేటు వద్ద ఉన్న భారీ గొయ్యి విషయంలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గొయ్యి పూడ్చకపోతే మాత్రం ప్రాజెక్ట్ మనడుగడకే ప్రమాదం అని నిపుణులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఓ అధ్యయనం సంచలనం సృష్టించింది.

Also Read : రైలు ఎక్కుతున్నారా.. ఇవి తెలుసుకోవాల్సిందే..!

ప్రాజెక్ట్ మనుగడను దృష్టిలో పెట్టుకుని.. తుంగభద్ర ప్రాజెక్టులొ మొత్తం 33 గేట్లు మార్చాల్సిందేనని తాజా అధ్యయనం నివేదక ఇచ్చింది. కేంద్ర జలసంఘం, జాతీయ డ్యాం భద్రతా అథారిటీ, ఎ.కె.బజాజ్ కమిటీ సిఫార్సు చేసాయి. తుంగభద్ర ప్రాజెక్టులో మొత్తం అన్ని గేట్లు, ప్రాజెక్టు సామర్థ్యంపై సమగ్ర అధ్యయనం నిర్వహించారు. రేడియోగ్రఫీ, అల్ట్రాసోనిక్, ఎంపీటీ, డీపీటీ పరీక్షల్లో నైపుణ్యమున్న కేఎస్ఎన్డీటీ సర్వీసెస్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇప్పటికే కొట్టుకుపోయిన 19వ నంబర్ గేటు మినహా మిగిలిన 32 గేట్ల సామర్థ్యంపై అధ్యయనం చేసారు.

Also Read : ఇది చెన్నై జట్టేనా..? రైనా తర్వాత ఎవరు..?

ఆయా గేట్ల సామర్థ్యం బాగా తగ్గిపోయినందున అన్నింటినీ మార్చాలని నివేదికలో స్పష్టం చేసింది. తుంగభద్ర డ్యాంలో మొత్తం అన్ని గేట్లు మార్చాల్సిందేనని ఎ.కె.బజాజ్ కమిటీ కూడా గత సెప్టెంబరులోనే నివేదిక ఇచ్చారు. మొత్తం గేట్లు మార్చాలంటే దాదాపు 250 కోట్లు ఖర్చు కానుంది. తుంగభద్రలోకి సాధారణంగా జులై నాటికే ప్రవాహం ఉంటుంది. అంటే మూడు నెలల సమయమే ఉంది. ఈలోగా ఎంత మేర పనులు చేయగలరు అనేది చూడాలి. తుంగభద్రలో ఎంత నీటిని నిల్వ చేయగలరనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటి నిల్వ కష్టమేనని నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్