Tuesday, October 28, 2025 07:24 AM
Tuesday, October 28, 2025 07:24 AM
roots

తిరుమలలో ఆసక్తి రేపుతున్న న్యాయ విచారణ

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో ఇప్పుడు విచారణ వేగవంతం చేసారు. ఈ ఘటనలో బాధ్యులు ఎవరు అనే దానిపై న్యాయ విచారణ జరుగుతోంది. తిరుపతి కలెక్టరేట్ లో న్యాయవిచారణ కమిషన్ విచారిస్తోంది. తొక్కిసలాట ఘటన పై మూడో దశ విచారణ మొదలైంది. వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందగా.. 44 మంది భక్తులు గాయపడ్డారు. విచారణ కమిషన్ హెడ్ గా రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ సత్యనారాయణమూర్తిని నియమించారు.

Also Read : బాబు ప్రయోగం సక్సెస్ అవుతుందా..?

ఇప్పటికే రెండు దశల్లో విచారణ పూర్తి చేయగా బాధితులు, సాక్షులను నేరుగా వర్చువల్ గా విచారించింది కమీషన్. ఈ నెల 14 నుంచి మూడు రోజులపాటు తిరుమలలో పర్యటించిన కమిషన్… భక్తుల క్యూలైన్లు, టిటిడి ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేయనున్నారు సత్యనారాయణమూర్తి. నేటి నుంచి మూడు రోజుల టీటీడీ ఈవో, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ లను కమిషన్ విచారిస్తుంది. ఈ రోజు కమిషన్ ముందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ హాజరయ్యారు.

Also Read : వైసీపీ యాక్టివ్ మోడ్.. రంగంలోకి సజ్జల..!

19 న తిరుపతి మాజీ ఎస్పీ సుబ్బరాయుడు, మాజీ టీటీడీ జేఈవో గౌతమి, టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ కుమార్, 13 మంది టీటీడీ జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు సిఐలు, 6 మంది ఎస్ఐలు హాజరు కానున్నారు. ఈ నెల 20 న, సీవీఎస్ఓ, మాజీ సీవీఎస్ఓలను విచారించనున్నారు. 21 నుంచి 23 వరకు మూడు రోజులు 42 మంది విజిలెన్స్ సెక్యూరిటీ స్టాప్, 32 మంది పోలీసు సిబ్బందిని విచారించనున్నారు. దీనితో ఈ విచారణలో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్