Friday, September 12, 2025 07:18 PM
Friday, September 12, 2025 07:18 PM
roots

టీటీడీ సంచలన నిర్ణయం..? వారికి గుడ్ బై..?

గత ఐదేళ్లలో టీటీడీలో అన్యమత ఉద్యోగుల ప్రభావం ఎక్కువగా పెరిగిపోయింది. ఉన్నత స్థాయిలో కూడా అన్య మతస్తుల ప్రభావం ఎక్కువగా ఉండటం పై తీవ్రస్థాయిలో ఆరోపణలు వినిపించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత దీనిపై గట్టిగానే ఫోకస్ పెడుతోంది. తిరుమల నుంచి అన్యమతం స్వీకరించిన ఉద్యోగస్తులను తొలగించాలనే డిమాండ్ గట్టిగానే వినపడుతోంది. చర్చిలకు వెళుతూ శ్రీవారి సొమ్ము తింటారా అంటూ కొంతమంది టార్గెట్ గా విమర్శలు వస్తున్నాయి. వీటికి చెక్ పెట్టే విధంగా టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: గేట్స్-బాబు మీట్.. నేషనల్ మీడియా హడావుడి…!

తిరుమల దివ్య క్షేత్రంలో స్వీపర్ స్థాయి నుంచి డిప్యూటీ ఈవో స్థాయి వరకు అన్యమత ఉద్యోగస్తులను టిటిడిలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గత కొన్నాళ్లుగా డిమాండ లు వినపడుతున్నాయి. 2018లో అప్పటి టీటీడీ ఈవో అనిల్ కుమార్ ప్రత్యేక ఎంక్వయిరీ చేసి అన్ని మతస్థలను గుర్తించారు. అనంతరం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత కొంతమేర ఈ డిమాండ్ ను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. 2024లో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడును నియమించారు.

Also Read: లోకేష్‌కు అదిరిపోయే బర్త్‌ డే గిఫ్ట్..!

54వ పాలక మండలి కొలువుదీరిన మొదటి సమావేశంలోనే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక చైర్మన్ సహా సభ్యులంతా ధార్మిక కార్యక్రమాలు.. తిరుమల పవిత్రత తమ బాధ్యత అనే ప్రకటన చేశారు. టీటీడీ లో పనిచేసే ఉద్యోగస్తుల్లో అన్యమతస్తులు ఎంతమంది ఉన్నారో అనే దానిపై స్పష్టత లేదు. అధికారికంగా 50లోపే ఉంటారని లెక్కలు చెబుతున్నా… అనధికారికంగా ఆ సంఖ్య 300కు పైగానే ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగుల్లో ప్రస్తుతం 31 మంది అన్యమత ఉద్యోగస్తులు విధులు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రాథమిక అంచనాకొచ్చింది.

Also Read: “గెలిపించు తల్లి” ఒత్తిడితో కాళీ గుడికి గంభీర్

దీనితో వారికే టిటిడి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకోవాలని మొదటి ఆఫర్ ఇచ్చింది. ఒకవేళ వీఆర్ఎస్ వద్దు అనుకుంటే ప్రభుత్వ సంస్థల్లో బదిలీకి అంగీకారం తెలపాలని సూచించింది. ఉద్యోగస్తులు రెండు ఆప్షన్స్ లో ఒకటి ఎంచుకోక తప్పదని తేల్చి చెప్పారు. అయితే 2018కి ముందు 74 మందికి పైగా అన్ని మతస్తులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. ఆ తర్వాత అన్యమతస్తులు కోర్టుకు వెళ్లడంతో ఆ నిర్ణయం వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు మాత్రం కోర్టు కూడా అడ్డు చెప్పకుండా ఉండేవిధంగా ప్రణాళిక సిద్ధం చేసి అన్యమతస్తులను పక్కన పెట్టాలని కసరత్తు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్