Friday, September 12, 2025 05:02 AM
Friday, September 12, 2025 05:02 AM
roots

మోడీకి ఉక్కపోత.. 2012 సీన్ రిపీట్

కేంద్ర ప్రభుత్వం.. గత పదేళ్లుగా ఉన్నంత స్వేచ్ఛగా ఇప్పుడు కనబడటం లేదు అనే అభిప్రాయాలు బలంగా వినపడుతున్నాయి. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకుడిగా ఎదిగారు. 2019లో భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రావడం మోడీ బలాన్ని మరింత పెంచింది. ఆ తర్వాత పలు కీలక నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 2024 ఎన్నికల్లో సొంతగా మెజారిటీ రాకపోయినా మిత్రపక్షాలను కలుపుకొని అధికారంలోకి వచ్చింది.

Also Read : ఇలా అయితే కష్టం.. చంద్రబాబు సీరియస్..!

అయితే గత పది సంవత్సరాల నుంచి లేని ఇబ్బందులు ఇప్పుడు బిజెపికి వస్తున్నాయి. దేశంలో ప్రతిపక్షాలు పట్టు బిగిస్తున్నాయి. అటు అంతర్జాతీయ విధానాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరి మోడీ సర్కార్ కు తలనొప్పిగా మారింది. రష్యా తో చమురు కొనుగోలు విషయంలో భారత్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ ఏకంగా 50% సుంకాలు విధించారు. అటు పాకిస్తాన్ కూడా పదే పదే భారత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది.

Also Read : పులివెందుల సిత్రాలు.. మళ్లీ అదే ప్రయత్నం..!

విపక్షాలు సైతం మోడీ సర్కారును ఓటర్ల లిస్టు విషయంలో ఇబ్బంది పెడుతున్నాయి. నకిలీ ఓట్లను నమోదు చేయించారంటూ.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని కూడా టార్గెట్ చేస్తూ కేంద్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిణామాలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 2012లో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే ఇబ్బంది పడింది. విదేశాల నుంచి ముఖ్యంగా అమెరికా నుంచి ఇబ్బందులు ఎదుర్కొంది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత విపక్షాలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ వచ్చాయి. ఇప్పుడు బిజెపి విషయంలో కూడా అదే జరుగుతోంది అనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. భవిష్యత్తులో మరిన్ని అంశాల్లో కేంద్రం ఇబ్బంది పడటం ఖాయంగా కనబడుతోంది. బీహార్ ఎన్నికల్లో ఒకవేళ బిజెపి ఓడిపోతే మాత్రం పరిస్థితిలు మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉండవచ్చు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

నేపాల్ పరిస్థితి.. పవన్...

నాలుగైదు రోజులుగా నేపాల్ లో మారుతున్న...

కొణిదెల వారసుడు వచ్చేశాడు..!

కొణిదెల కుటుంబంలోకి కొత్త వారసుడొచ్చాడు. వరుణ్...

పోల్స్