అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తీసుకొచ్చిన కొత్త బిల్లు అమెరికాలో పనిచేస్తున్న భారత నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు వీసాలు, దేశ బహిష్కరణ విషయంలో కంగారు పెట్టిన ట్రంప్ సర్కార్.. ఇప్పుడు చెల్లింపులు, జీతాల విషయంలో ఫోకస్ చేయడం కంగారు పెడుతోంది. గత వారం అమెరికాలో ప్రవేశపెట్టిన బిల్లులో అమెరికన్ లు కాకుండా ఆ దేశంలో స్థిరపడిన ఇతర దేశాల వ్యక్తులు.. ఆ దేశం నుంచి ఇతర దేశాలకు నిధులు పంపితే.. 5 శాతం పన్ను విధించాలని నిర్ణయించారు.
Also Read : ఎవరీ ధనుంజయ రెడ్డి.. జగన్ తో ఏమా బంధం..?
అమెరికాలో ఎక్కువగా ఉండే భారతీయులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో ఎక్కువగా నివాసం ఉంటుంది భారతీయులే. అక్కడి సంపాదనను భారత్ కు పంపి ఇక్కడ.. ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. అలాగే వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. అమెరికన్ కాంగ్రెస్ లో ఈ బిల్ ను ప్రవేశ పెట్టారు. హెచ్ 1 బీ వీసాలపై అమెరికాలో ఉండేవారిపై ఈ బిల్ ప్రభావం పడనుంది. ఎకనామిక్ థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ప్రకారం.. భారతీయులపైనే ఈ ప్రభావం పడనుంది.
Also Read : హెచ్ 1 బీ పై ట్రంప్ సర్కార్ ఫోకస్..?
ప్రతీ వంద డాలర్లకు 5 డాలర్ల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2024 ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం.. భారత్ కు విదేశాల నుంచి ఎక్కువ నిధులు వస్తున్నాయి. విదేశాల నుండి 129 బిలియన్ డాలర్లు దేశానికి వస్తున్నాయి. 2023-24లో దేశానికి వచ్చే నిధుల్లో 28 శాతం అమెరికా నుంచే వచ్చాయి. వరల్డ్ రెమిటెన్స్‌లలో భారత్ 14.3% వాటాను కలిగి ఉంది. దీనితో రెమిటెన్స్ ఫ్లోలో 10–15 శాతం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రభావం భారత ఆర్ధిక వ్యవస్థపై కూడా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.