Friday, September 12, 2025 06:56 PM
Friday, September 12, 2025 06:56 PM
roots

అమెరికా వెళ్ళడం ఇంత భారమా..? ఇవేం ఫీజులు ట్రంప్ మామ..?

అమెరికాలో జీవించడం అనేది ఎందరో భారతీయుల కల. దశాబ్దాలుగా మధ్యతరగతి ప్రజలు అమెరికాలో జీవితం వెతుక్కుని దేశం నుంచి వెళ్ళిపోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు క్రమంగా పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. అమెరికాలో జీవితం క్రమంగా కష్టంగా మారడం ఒకటి అయితే.. ఇప్పుడు అమెరికా వెళ్ళడం మరింత కష్టంగా మారుతోంది. స్టూడెంట్స్ నుంచి పర్యాటకుల వరకు అమెరికా వీసా చార్జీల దెబ్బకు భయపడే పరిస్థితి క్రియేట్ చేసారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.

Also Read : బజ్ బాల్ ఎక్కడ..? భారత్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ కు షేక్ అయింది…!

వీసా చార్జీలు 250 డాలర్ల వరకు పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూలై 4, 2025న సంతకం చేసిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ వీసా ఫీజులకు షాక్ ఇచ్చింది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలకు 250 డాలర్ల కొత్త ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’ని ప్రవేశపెట్టారు. త్వరలోనే ఈ చార్జీలు అమలు కానున్నాయి. ఇక నుంచి 20 వేల రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులు ఒకసారి చూస్తే..

Also Read : కొత్త ఐఫోన్ లుక్ చూసారా..? పక్కా డిఫరెంట్ మామ..!

B-1/B-2 వీసా ప్రస్తుత ఫీజు రూ. 15,878 (USD 185) గా ఉండగా.. కొత్త ‘వీసా ఇంటిగ్రిటీ ఫీజు’ రూ. 21,457 గా ఉండనుంది. I-94 రుసుము చార్జీలు 24 డాలర్లు, ESTA చార్జీలు 13, ఇలా అన్నీ కలుపుకుని మొత్తం 445 డాలర్లు కానుంది. అంటే మన కరెన్సీలు రూ. 38,173. అటు ఇటుగా 40 వేల రూపాయలు ఉంటుంది. వీసా స్లాట్ ల కోసం చాలా మంది ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వెళ్తూ ఉంటారు. ఆ రవాణా చార్జీలు, హోటల్, ఫుడ్ ఇవన్నీ చూసుకుంటే అటు ఇటుగా వీసా ఫీజు 50 వేల వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా చెల్లించాల్సి ఉంటుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్