అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకునే నిర్ణయాలపై భారత్ లో ఆందోళన వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ తో వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అమెరికా అనేక దేశాలపై కొత్త సుంకాలను విధించినప్పటికీ, భారత్ విషయంలో సానుకూలంగా ఉందని ట్రంప్ వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ మంగళవారం మాట్లాడుతూ భారత్ తో వాణిజ్య ఒప్పందానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ రెండు దేశాల మధ్య సుంకాలను తగ్గించాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి.
Also Read : సుప్రీం చీఫ్ జస్టీస్ సంచలన కామెంట్స్
తాము యునైటెడ్ కింగ్‌డమ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని.. చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నామని.. భారత్ తో ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ విషయంపై భారత్ కు ఓ లేఖ రాస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్, థాయిలాండ్, దక్షిణ కొరియా మరియు జపాన్ వంటి దేశాలపై సుంకాలు భారీగా విధిస్తామని ట్రంప్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. భారత్ నుంచి పాడి, వ్యవసాయ రంగాల దిగుమతుల విషయంలో అమెరికా ఒత్తిడి చేస్తోంది.
Also Read : ఐటీ హబ్‌గా వైజాగ్… లోకేష్ కృషికి కంపెనీలు ఫిదా…!!
ఈ రంగాలపైనే త్వరలో ఒప్పందం జరిగే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు మన దేశ ఆర్ధిక వ్యవస్థలో కేవలం 16 శాతం మాత్రమే పాత్ర పోషించినా.. దేశ జనాభాలో సగం మందికి అవే జీవన ఆధారం. వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేసే అంశంలో సమస్యలు ఉన్న సంగతి తెలిసిందే. కీలకమైన ఉత్పత్తులను ఒకవేళ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే అది భారత్ పై ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయి.