Tuesday, October 28, 2025 04:51 AM
Tuesday, October 28, 2025 04:51 AM
roots

తెలుగు రాష్ట్రాల్లో త్రివేణి సంగమాలు ఉన్నాయి…!

ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అంచనాలుకు మించి భక్తులు వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు 65 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా అక్కడికి చేరుకుని పుణ్య స్థానాలు ఆచరించారు. త్రివేణి సంగమం వద్ద భక్తిశ్రద్ధలతో కోట్లాదిమంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. దీనితో మరోసారి త్రివేణి సంగమం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా త్రివేణి సంగమాలు ఉన్నాయి.

Also Read : అధినేతపై తెలుగు తమ్ముళ్ల విమర్శలు..!

ఈ విషయం చాలామందికి తెలియదు. అవును తెలంగాణలో నిజామాబాద్ లో ఒక త్రివేణి సంగమం ఉందట. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తిలో త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గోదావరి మంజీరా, హరిద్రా నదులు కలుస్తాయి. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వర్ వద్ద పుట్టిన గోదావరి నది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకూర్తి వద్ద తెలంగాణలో అడుగుపెడుతుంది. ఇక్కడ గోదావరి నదిలో హరిద్ర, మంజీరా నదులు కలుస్తాయి.

Also Read : పవన్ టార్గెట్ అదే.. అందుకే తేనె తుట్టును కదిపారా…?

తెలంగాణలో గోదావరి నదిలో కలిసే మొదటి ఉపనది మంజీరా. ఇది కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తోంది. తెలంగాణలో ప్రముఖ త్రివేణి సంగమాలలో ఇది ఒకటని తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఇప్పటికే తమ అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈ త్రివేణి సంగమం వద్ద భక్తుల కోసం మూడు ఘాట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ గోదావరి గట్టు పైన ఒక పురాతన శివాలయం కూడా ఉందట. దీనిని నల్లరాతితో నిర్మించినట్లు తెలంగాణ దేవాదాయ శాఖ ప్రకటించింది.

Also Read : ఉగాండా అధ్యక్షుడితో కేసీఆర్ పోటీ.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

దాదాపు నాలుగైదు పురాతన దేవాలయాలు త్రివేణి సంగమం వద్ద ఉన్నాయి. ఇక తెలంగాణలోనే కాలేశ్వరం త్రివేణి సంగమం కూడా ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో ఉన్న కాలేశ్వర శైవక్షేత్రం వద్ద కూడా త్రివేణి సంగమం ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటుగా పురాణాల్లో పేర్కొన్న సరస్వతీ నది కూడా కలుస్తుందని భక్తులు నమ్ముతారు. ఇక సంగం, సంగమేశ్వరం వంటివి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో సంగం ఉంది. ఇక్కడ మూడు నదులు కలుస్తాయి. నాగావళి, వేగవతి, సువర్ణముఖి నదుల సంగం.. ప్రదేశమే సంగం. ఇక సంగమేశ్వరం విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర, భవనాసి నదులు కృష్ణా నదిలో కలుస్తాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్