Friday, September 12, 2025 05:30 PM
Friday, September 12, 2025 05:30 PM
roots

జగన్ మేనిఫెస్టో సిద్ధం.. ఈసారి వరాలు ఇవే

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. అభ్యర్థుల ఎంపిక తో పాటు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడానికి డిసైడ్ అయ్యాయి. ఈ విషయంలో సీఎం జగన్ దూకుడుగా ఉన్నారు. సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. లక్షలాదిమంది జనాలను తరలించి విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే మూడు ప్రాంతాల్లో ఈ సభలు పూర్తయ్యాయి. విశాఖ జిల్లా భీమిలి లో తొలి సభను నిర్వహించారు. తర్వాత దెందులూరు, రాప్తాడు లో సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అదే స్ఫూర్తితో నాలుగో సభకు సిద్ధపడుతున్నారు. ఈనెల 10న గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దులో సభ ఏర్పాటుకు నిర్ణయించారు.

అయితే సిద్ధం నాలుగో సభ ఎన్నో సంచలనాలకు వేదికగా మార్చాలని వైసీపీ హై కమాండ్ భావిస్తోంది. దాదాపు 15 లక్షల మందిని జన సమీకరణ చేసి సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని వైసీపీ నేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. ఇదే సభపై ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా రుణమాఫీ వంటి కీలక ప్రకటన చేసి.. విపక్షాల ప్రయత్నాలను షేక్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఎన్నికల్లో ప్రకటించిన నవరత్నాలను శత శాతం అమలు చేసి.. ప్రజాభిమానం చూరగొన్నట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు ఆకట్టుకునేలా ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో నవరత్నాలను జగన్ ప్రకటించారు. ప్రజల మధ్యకు బలంగా తీసుకెళ్లగలిగారు. ప్రజలు కూడా వాటిని నమ్మారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. సంపూర్ణ మద్య నిషేధం, జాబ్ క్యాలెండర్ వంటి విషయాల్లో మాత్రం జగన్ హామీ అమలు కాలేదు. మిగతా విషయాల్లో మాత్రం సంక్షేమాన్ని బాగానే అమలు చేయగలిగారు. దీంతో జగన్ చెబితే చేస్తారు అని ప్రజల సైతం భావించే పరిస్థితి ఉంది. అందుకే ఈసారి మేనిఫెస్టోను ఆకర్షవంతంగా తీర్చిదిద్దాలని జగన్ భావించారు. అందుకు తగ్గట్టుగా కసరత్తు సైతం చేస్తున్నారు. ముఖ్యంగా రుణమాఫీ ప్రకటించి విపక్షాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇవ్వాలని భావిస్తున్నారు. దాంతో పాటు కొన్ని ఆసక్తికర హామీలు ఇవ్వాలని చూస్తున్నారు. ఈనెల 10న సిద్ధం సభా వేదికపై మ్యానిఫెస్టో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరి దృష్టి ఆ సభ పై పడనుంది. వైసీపీ మేనిఫెస్టో పై ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్