Friday, September 12, 2025 03:33 PM
Friday, September 12, 2025 03:33 PM
roots

ఈ రోజు (05-07-2025) మీ రాశి ఫలితాలు

మేషం 05-07-2025

వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. ధన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఆప్తులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి. నిరుద్యోగుల ప్రయత్నాలు వృధాగా మిగులుతాయి.

—————————————

వృషభం 05-07-2025

రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదర వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల మన్ననలు పొందుతారు.

—————————————

మిధునం 05-07-2025

పాత ఋణ ఒత్తిడి నుండి బయట పడటానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. చిన్న నాటి మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటా బయట చికాకులు అధికమౌతాయి. వృత్తి వ్యాపారాలలో ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.

—————————————

కర్కాటకం 05-07-2025

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్ధిక కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు అప్పగించిన విధులు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

—————————————

సింహం 05-07-2025

ఆదాయం కన్నా ఖర్చు అధికమౌతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. ఉదర సంబంధ అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలలో నూతన సమస్యలు జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

—————————————

కన్య 05-07-2025

సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు పొందుతారు. ఆర్ధిక లాభం కలుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తాయి. అన్ని విషయాలలో బంధు మిత్రుల సహాయం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది.

—————————————

తుల 05-07-2025

ఉద్యోగమున అధికారులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలతో చెయ్యడం మంచిది. ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువులలో స్వల్ప వివాదాలు ఉంటాయి.

—————————————

వృశ్చికం 05-07-2025

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల ప్రవర్తన వలన మానసిక అశాంతి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

—————————————

ధనస్సు 05-07-2025

సంతాన విద్యా విషయాలు సమస్యాత్మకంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత అధికమౌతాయి. ఖర్చులను అదుపు చెయ్యడం కష్టంగా ఉంటుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

—————————————

మకరం 05-07-2025

జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు. ప్రభుత్వ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగమున ఉన్నత పదవులు పొందుతారు.

—————————————

కుంభం 05-07-2025

వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయం విషయంలో లోటుపాట్లు అధిగమిస్తారు. వ్యాపారములలో శత్రు సమస్యలు నుండి బయటపడతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు.

—————————————

మీనం 05-07-2025

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

—————————————

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్