Tuesday, October 28, 2025 01:36 AM
Tuesday, October 28, 2025 01:36 AM
roots

ఈ నాయకులు తప్పించుకుంటున్నారా లేక తప్పించబడుతున్నారా?

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు వైసీపీ నేతలను ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం బాగా జరిగింది. ముఖ్యంగా రెడ్ బుక్ అమలు అనేది చాలా కఠినంగా ఉంటుంది అంటూ మనం ఎన్నో వార్తలు చూస్తూనే వచ్చాం. లోకేష్ రెడ్ బుక్ కి గట్టిగానే ప్రచారం చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు, మాజీ మంత్రుల అవినీతి వ్యవహారాల మీద సీరియస్ గానే ఫోకస్ చేసి విచారణ ముమ్మరం చేసారు. ఒకరిద్దరిని అరెస్ట్ కూడా చేసి జైలుకి తరలించారు.

ఇంత వరకు బాగానే ఉంది గాని… కొందరు నేతలను మాత్రం అధికారులే కాపాడుతున్నారనే ఆరోపణ టీడీపీ వర్గాల్లో వినపడుతోంది. దేవినేని అవినాష్, వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నానీ, అంబటి రాంబాబు, మోహిత్ రెడ్డి, పేర్ని నానీ, ద్వారంపూడిని గతంలో వైసీపీతో అంటకాగిన అధికారులే కాపాడుతున్నారనే వాదనలు బలంగా వినపడుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీరు చెలరేగిపోయారు. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటాన్ని చూసుకుని అన్ని విధాలుగా రెచ్చిపోయి విమర్శలు చేసారు. కాని వీళ్ళ మీద ఇప్పటి వరకు ఈగ కూడా వాలలేదు. అసలు వల్లభనేని వంశీ ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. ఆయనను అరెస్ట్ అంటూ మీడియాలో వార్త కూడా వచ్చింది.

కాని అరెస్ట్ జరగలేదు సరికదా, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. కానీ హైకోర్ట్ కి వెళ్లి పిటీషన్ వేసారు. కొడాలి నానీ మీద ఇప్పటి వరకు ఒక్క బలమైన కేసు కూడా నమోదు కాలేదు. దేవినేని అవినాష్ పార్టీ ఆఫీసు మీద దాడి చేయించా అని చెప్పుకున్నా కూడా ఇప్పటి వరకు విచారాకి పిలిచిన పరిస్థితి లేదు. అంబటి రాంబాబు, పెర్ని నానీ తమ నోటికి పని చెప్తూనే ఉన్నారు. హత్యాయత్నం కేసు నమోదు అయినా కూడా మోహిత్ రెడ్డి కి నోటీసులు ఇచ్చి పంపించారు. చంద్రబాబు ఇంటి మీద దాడి చేసినా జోగి రమేష్ ను మాత్రం ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు.

అక్రమాలు చేసారనే సాక్ష్యాలు బలంగా ఉన్నా కూడా వీళ్ళ అరెస్ట్ మాత్రం జరగడం లేదు. ద్వారంపూడి రేషన్ బియ్యం వ్యవహారంలో సాక్ష్యాలు దొరికినా అధికారులు అడుగులు వేయడం లేదు. ఇక ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంచుకుని కూడా పిన్నెల్లి వెంకటరామి రెడ్డి మరియు వల్లభనేని వంశీమోహన్ జాడ కనిపెట్టలేకపోతున్నారు. మరి వీరిని ఎవరు కాపాడుతున్నారు అనేది అర్ధం కాని పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యమా లేక వాళ్ళ బలమా లేక ప్రభుత్వంలో ఉన్న కొందరి డబుల్ గేమ్ నా అనేది అర్ధం కావడం లేదు. వీళ్ళ అరెస్ట్ కోసం టీడీపీ నేతలు, స్థానిక ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఏమి జరగబోతుందో తెలియాలి అంటే మరికొంత కాలం ఎదురుచూడగా తప్పని పరిస్థితి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్