Monday, October 27, 2025 08:01 PM
Monday, October 27, 2025 08:01 PM
roots

చంద్రబాబు పై ఫిదా అయిన వైసీపీ నాయకులు

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత కాస్త ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత అయిదేళ్ళ నుంచి ఉన్న నియంత సంస్కృతికి దాదాపుగా చంద్రబాబు చరమ గీతం పాడారు. కొందరు అధికారులలో ఇంకా వైసీపీ గాలి ఉన్నా దాన్ని కూడా తొలగించే ప్రయత్నం కాస్త గట్టిగానే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రజా ప్రతినిధులు, కొందరు నాయకులు ఈ ప్రభుత్వంలో కొత్త అనుభవాలను చవి చూస్తున్నారు. ముఖ్యంగా పార్టీ మారిన నేతలకు తెలుగుదేశంలో ఉన్న ఆత్మీయ వాతావరణం ఎంతగానో నచ్చుతుందని తెలుస్తోంది.

తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళినప్పుడు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు ఎంపీలతో మాట్లాడే విధానం చూసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాస్త షాక్ అయ్యారట. నేను ఇలాంటి వాతావరణమే గత అయిదేళ్ళ నుంచి చూడలేదని, కనీసం మా ఎంపీలు ఎవరూ జగన్ ను స్వేచ్చగా కలిసే పరిస్థితి లేదని అన్నారట. లంచ్, డిన్నర్ లాంటి సాంప్రదాయం గాని, పార్లమెంట్ లో ఏం జరిగింది అని అడగడం గాని, ఎంపీలు ఏం నేర్చుకున్నారు అని తెలుసుకోవడం గాని ఏదీ లేదట.

తనను ప్రజా ప్రతినిధులు ఎప్పుడైనా స్వేచ్చగా కలవోచ్చని, రాష్ట్రం తరుపున ఢిల్లీలో నోరు చెవులు ఎంపీలే అని, ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలని సూచించారట చంద్రబాబు. ఈ సందర్భంగా కాసేపు జోక్స్ కూడా వేసుకుని నవ్వుకున్నారట. అలాగే మాజీ మంత్రులు ఇద్దరు ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. వారిలో ఒకరు మంత్రి కూడా అయ్యారు. వారు కూడా టీడీపీలో ఉన్న క్రమశిక్షణ కలిగిన వాతావరణం చూసి ఆశ్చర్యపోతున్నారట. సాంప్రదాయ రాజకీయాలు తమకు ఎంతగానో నచ్చాయని, చంద్రబాబు తమను గౌరవిస్తున్న విధానం గౌరవంగా ఉందని సన్నిహితులతో పంచుకుంటున్నారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్