Monday, October 27, 2025 10:30 PM
Monday, October 27, 2025 10:30 PM
roots

సోమవారం టెస్ట్ పాస్ అయిన తండేల్.. అంచనాలకు మించి కలెక్షన్లు

అల్లు అరవింద్ నిర్మాతగా నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ము రేపుతుంది. భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తుంది. సినిమా రిలీజ్ అయి నాలుగు రోజులు కాగా సోమవారం కూడా వసూళ్లు భారీగా వచ్చాయి. వాస్తవానికి సోమవారం సినిమా కలెక్షన్లు చాలా తక్కువగా ఉంటాయి. వీకెండ్ ఏ రేంజ్ లో ఉన్నాయో సోమవారం కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో సినిమాకు కలెక్షన్లు వచ్చాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా 73 కోట్లు కలెక్ట్ చేసింది.

Also Read : తమిళనాడులో విజయ్.. జగన్ ఫార్ములా…?

అలాగే సోమవారం ఈ సినిమాకు బుక్ మై షో లో ఏకంగా 73,000 టికెట్లు బుక్ అయ్యాయి. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. నాలుగు రోజుల్లో 73 కోట్లు రావడంతో.. కచ్చితంగా మరో రెండు మూడు రోజుల్లో 100 కోట్ల మార్క్ అందుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాలెంటైన్స్ డే కూడా ఉండటంతో ఈ సినిమాకు వసూళ్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా అమెరికాలో ఇప్పటివరకు 7,50,000 డాలర్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది.

Also Read : బిజెపి ఆదేశాలు.. రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్

అటు యూకే, ఆస్ట్రేలియాలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీనితో కచ్చితంగా 120 నుంచి 150 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉందని.. టాలీవుడ్ పండితులు అంటున్నారు. అదే జరిగితే మాత్రం నాగచైతన్య కెరీర్ లోనే కాదు అక్కినేని ఫ్యామిలీ చరిత్రలోనే ఎక్కువ వసూళ్లు సాధించిన హీరోగా నాగచైతన్య రికార్డులు క్రియేట్ చేస్తాడు. ఇక ఈ సినిమాకు స్టోరీ ఎంత ప్లస్ అయిందో సాయిపల్లవి కూడా అదే రేంజ్ లో ప్లస్ అవడం వసూళ్లు పెంచుతుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్