గత దశాబ్ద కాలం నుంచి ఇండియన్ సినిమా వసూళ్ల పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఒకప్పుడు సినిమా విజయం సాధించడం అంటే వంద రోజులు ఆడటం. ఇప్పుడు సినిమా విజయం సాధించడం అంటే 1000 కోట్లు సాధించటం అనే ఫీల్ లోనే డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా సినిమాల పేరుతో ఇప్పుడు అన్ని భాషల్లోనూ మన తెలుగు హీరోల హవా నడుస్తోంది. బాలీవుడ్ మొదలుపెట్టిన ఈ వసూళ్ల ట్రెండును మన తెలుగు హీరోలు ఎక్కువగా ఫాలో అవుతున్నారు.
Also Read : ఏపీలో విమానాశ్రయాలకు కొత్త కళ
అటు తమిళంలో కూడా సీనియర్ హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ భారీ హిట్లు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సినిమాలకు ఇప్పుడు బెనిఫిట్ షో అనేది కామన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు ఎక్కువగా రన్ చేస్తున్నారు. నిర్మాతలు దీనితో సినిమాకు హైప్ పెంచాలని ప్రమోషన్స్ విషయంలో బెనిఫిట్ షోలను వాడుకోవాలని భావిస్తున్నారు. కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనే ధీమా ఉంటే మాత్రం ధరలను అత్యధికంగా పెంచేసి బెనిఫిట్ షోలను ఆడిస్తున్నారు.
రీసెంట్ గా పుష్ప ది రూల్ సినిమా విషయంలో ఇదే ఫాలో అయ్యారు. అయితే ఇది మిస్ ఫైర్ కావడంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పుష్ప సినిమా బెనిఫిట్ షో లను రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఇవ్వగా తెలంగాణలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70mm ధియేటర్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా మరో చిన్నారి ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. దీనితో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక తాము బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేసారు.
Also Read : తగ్గేదే లే అంటున్న గ్లామర్ బ్యూటీలు…!
టాలీవుడ్ పెద్దలు కూడా ఈ విషయాలు అర్థం చేసుకుని ఇక తమను బెనిఫిట్స్ గురించి అడగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే హీరో అల్లు అర్జున్ పై అలాగే పుష్ప సినిమా నిర్మాతలపై కేసు కూడా నమోదయింది. దీనితో ఇప్పుడు అల్లు అర్జున్ పై స్టార్ హీరోలు మండిపడుతున్నారు. అభిమానులు వస్తారని తెలిసినా వెళ్లి ప్రాణాలు తీసి ఇండస్ట్రీ పరువు తీయడం ఎందుకు అంటూ సీరియస్ అవుతున్నారు.




