Friday, September 12, 2025 10:41 PM
Friday, September 12, 2025 10:41 PM
roots

మాజీ క్రికెటర్ కు బీజేపీ గాలం.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. దూకుడు పెంచింది. ఈ మధ్య కాస్త సైలెంట్ గా ఉన్నట్లు కనపడుతున్న ఆ పార్టీ నాయకులు.. గ్రౌండ్ వర్క్ విషయంలో జాగ్రత్త పడుతున్నారు. తెలంగాణలో స్టార్ ఇమేజ్ ఉన్నవాళ్లను పార్టీలోకి తీసుకోవాలని బిజెపి అధిష్టానం భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో బిజెపి అగ్రనాయకత్వం.. ఓ స్టార్ కు గాలం వేసినట్లు సమాచారం.

Also Read : జగన్ చేష్టలతో షాక్ లో వైసీపీ

ఉత్తరాది తరహా రాజకీయాలకు ఇక్కడ శ్రీకారం చుడుతోంది కమలం పార్టీ. ప్రస్తుతం వస్తున్న కొన్ని కథనాల ప్రకారం చూస్తే.. భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కు బిజెపి గాలం వేసినట్లు సమాచారం. 2021లో ఒకసారి ఇలాగే ప్రచారం జరిగింది. లక్ష్మణ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉందని.. ఆయనకు మేయర్ పదవిని బిజెపి ఆఫర్ చేసిందని వార్తలు వచ్చాయి. కానీ అప్పట్లో లక్ష్మణ్ దీనిపై ఎక్కడా కూడా స్పందించడానికి ఇష్టపడలేదు. కర్ణాటకలో కూడా ఇలాగే అక్కడి ప్రముఖ క్రికెటర్లకు గాలం వేసింది బిజెపి.

Also Read : బాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు..!

ఇప్పుడు లక్ష్మణ్ విషయంలో కూడా అలాగే జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. లక్ష్మణ్ తో ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చర్చలు జరిపినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనతో పాటుగా సినీ ప్రముఖులకు కూడా గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ సినీ ప్రముఖుడు రాజకీయాల వైపు ఆసక్తి చూపిస్తున్నారని.. అందుకే ఆయనకు బిజెపి పెద్దలు ఆఫర్ కూడా ఇచ్చారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా లక్ష్మణ్ రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా బీజేపీకి ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్