కూటమి నేతల్లో ఇప్పుడు ఒకటే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. తెలుగుదేశం, జనసేనా పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతల్లో ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు.. ఎవరికి ముందుగా అవకాశమిస్తారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. ఎన్నికలకు 8 నెలల ముందే తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో కూడా పొత్తు కొనసాగుతుందని తేల్చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జనసేన పార్టీ కోసం కొన్ని సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. అందులో కీలకమైన స్థానం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసేందుకు పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ వర్మ తన సీటును త్యాగం చేశారు. దీంతో పవన్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది. వైసీపీ తరఫున మాజీ ఎంపీ వంగా గీత పోటీ చేసినప్పటికీ… పెద్దగా ఫలితం చూపలేదు. అయితే సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Also Read : సభలో 11 నిమిషాలు… చివరికి బాయ్‌కాట్..!
ఇక గతానికి భిన్నంగా ఏ పదవి లేని పవన్ సోదరుడు నాగబాబును కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అధికారికంగా లేఖ విడుదల చేశారు. టీడీపీలో ఎప్పుడూ ఇలా ఎవరికీ హామీ ఇవ్వలేదు… జరగలేదు కూడా. అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ముందుగా ఆయనను చట్టసభకు ఎంపిక చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే, లేదా ఎమ్మెల్సీగా నాగబాబుకు అవకాశం ఇచ్చిన తర్వాతే మంత్రిగా కేబినెట్‌లోకి తీసుకుంటే ఏ సమస్య రాదనేది నేతల సూచన. వాస్తవానికి ఈ జనవరిలోనే నాగబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. పైగా ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే మాట కూడా లేదు. దీంతో నాగబాబుకు కేబినెట్ యోగం ఇప్పట్లో లేదంటున్నారు జనసేన నేతలు.
Also Read : ప్రతి విషయానికీ ఆయనేనా… ఇలా అయితే కష్టమే..!
అయితే ప్రస్తుతం కూటమి నేతల్లో ఓ విషయంపై తెగ చర్చ నడుస్తోంది. ఈ నెల 27న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఇప్పటి నుంచే కొందరు ఆశావాదులు ఆయా స్థానాల కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇద్దరి పేర్లు మాత్రమే బలంగా వినిపిస్తున్నాయి. జననేన తరఫన నాగబాబు, టీడీపీ తరఫున వర్మకు అవకాశం వస్తుందనేది బహిరంగ రహస్యం. అయితే ఈ ఇద్దరిలో ముందుగా ఎవరికి వస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పిఠాపురంపైనే ప్రస్తుతం పవన్ పూర్తి ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జనసేన పార్టీ ఆవిర్భావ సభను కూడా పిఠాపురంలోనే నిర్వహిస్తున్నారు. దీంతో భవిష్యత్తులో కూడా వర్మకు పిఠాపురంలో అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో వర్మకు అవకాశం ఇస్తారా.. లేక నాగబాబుకు ఛాన్స్ ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.




