మనిషిలో ఆశ చావలేదు.. ఆశ.. మనిషిని ఎంత వరకు అయినా తీసుకెళ్తుంది. పదవీ వ్యామోహం అయితే.. ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది జీవితాంతం ఉంటుంది. కానీ.. ఆ నేత తీరు చూస్తే మాత్రం.. ఎప్పటికి పదవిలో ఉండాలనే ఆశ. ఇందుకోసం ఏదో ఒక రూపంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆయనే యనమల రామకృష్ణుడు. చేసిన ఒకే ఒక్క సాయానికి కృతజ్ఞతగా 30 ఏళ్లుగా యనమలకు చంద్రబాబు పెద్ద పీట వేస్తూనే ఉన్నారు. అయినా సరే.. ఇంకా ఏదో కావాలని ఇప్పటికీ డిమాండ్ చేస్తూ.. పార్టీ అధినేతపై ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నారు యనమల.
Also Read : మంగళగిరి ప్రజల దశాబ్దాల కల నెరవేర్చనున్న లోకేష్
యనమల రామకృష్ణుడు.. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఈయనే హాట్ టాపిక్. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలున్న నేత. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తుని నియోజకవర్గం నుంచి గెలిచిన యనమల.. ఎన్టీఆర్ తొలి క్యాబినెట్‌లోనే మంత్రి పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత 1985-89 మధ్య మంత్రిగా, 1989-94 మధ్య పీఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇక 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో బీసీ కోటాలో శాసనసభ స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అయితే 1995 ఆగస్టు సంక్షోభం సమయంలో రూల్స్ ప్రకారం నడుచుకుని చంద్రబాబు సీఎం అయ్యేలా వ్యవహరించారు యనమల. నాటి నుంచి నేటి వరకు యనమలకు చంద్రబాబు సముచిత స్థానమే ఇచ్చారు. స్పీకర్‌గా, ఆర్థిక శాఖ మంత్రిగా, పార్టీ పొలిట్‌బ్యూరో మెంబర్‌గా.. ఉన్నతస్థానంలో ఉంచారు.
Also Read : రాహుల్ కోపం ఎవరిపై..?
వాస్తవానికి యనమల ట్రాక్ రికార్డ్ పెద్ద గొప్పగా ఏం లేదు. 1983 నుంచి 2004 వరుసగా ఆరుసార్లు గెలిచారు యనమల రామకృష్ణుడు. ఆ తర్వాత నుంచి ఆయన గ్రాఫ్ పడిపోయింది. 2009 ఎన్నికల్లో తొలిసారి ఓడిన యనమల… ఆ తర్వాత నుంచి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయనకు చట్టసభలో అవకాశం ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో ఓడినప్పటికీ.. రెండుసార్లు మండలిలో అవకాశం ఇచ్చారు చంద్రబాబు. 2014 ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. తుని నియోజకవర్గంలో కూడా అన్న స్థానంలో పోటీ చేసిన తమ్ముడు కృష్ణుడు కూడా వరుసగా రెండుసార్లు ఓడిపోయాడు. అయితే 2014లో పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా కూడా ఆయనే ఎన్నికయ్యారు. దీంతో నియోజకవర్గం పార్టీ నేతలంతా.. ఇదేం చోద్యం అని ముక్కున వేలేసుకున్నారు.
Also Read : సజ్జలకు జగన్ బిగ్ షాక్.. మరో రెడ్డికి అగ్ర తాంబూలం
ప్రస్తుత ఎన్నికల్లో యనమల కుటుంబానికి వచ్చినన్ని పదవులు మరెవరికి రాలేదు. రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అలాగే మైదుకూరు ఎమ్మెల్యే టికెట్‌ను వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ దక్కించుకోగా.. ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలిచిన పుట్టా మహేష్ యాదవ్ కూడా రామకృష్ణుడు అల్లుడే. ఇక ప్రస్తుతం యనమల దివ్యకు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న ప్రభుత్వ విప్ పదవి కూడా వచ్చింది. ఇలా ఒకే ఇంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. 2009 నుంచి నియోజకవర్గంలో వరుసగా ఓడిపోతున్న యనమల ఫ్యామిలీకి వచ్చినన్ని పదవులు ఎన్టీఆర్ కుటుంబానికి కూడా రాలేదు. మొన్నటి ఎన్నికల్లో కూడా కూటమి హవాలో గెలిచేరే తప్ప.. నిజానికి నియోజకవర్గానికి యనమల చేసింది ఏమీ లేదనేది స్థానిక నేతల విమర్శలు. 2014లో మైదుకూరు నుంచి పోటీ చేసి ఓడిన యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు టీటీడీ బోర్డు ఛైర్మన్ వంటి అత్యున్నత అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
Also Read : సొంత కార్యకర్తపై టిడిపి కఠిన చర్యలు.. ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నట్లు?
సీనియర్ నేత అంటే.. పార్టీలో ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ పోవాలి. కానీ యనమల రూటే సెపరేటు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సగానికి పైగా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పెత్తనం చేయడానికి ప్రధాన కారణం యనమల. దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రూప్ రాజకీయాలకు యనమల తెరలేపారు. యనమలను కాదని ఎవరైనా టికెట్ దక్కించుకుంటే.. వారిని ఓడిస్తారనేది ప్రధాన ఆరోపణ. ఇక మాజీ మంత్రి దాడిశెట్టి రాజా చేతిలో హత్యకు గురైన ఆంధ్రజ్యోతి విలేకరి కాటా సత్యనారాయణ కుటుంబాన్ని యనమల కనీసం పరామర్శించలేదు. రాజాకు భయపడే సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళి కూడా అర్పించలేదని పార్టీ నేతలు యనమలపై ఫైర్ అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో యనమల కృష్ణుడు వ్యాపార లావాదేవీలు నడిపిస్తాడనే ఆరోపణలున్నాయి.
Also Read : కసిరెడ్డిని దేశం దాటించిన ఐపిఎస్
తాజాగా యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. 42 వసంతాల రాజకీయ ప్రస్థానం పేరుతో ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు మంత్రులు అనిత, నారాయణ, అచ్చెన్నాయుడుతో పాటు స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా హాజరయ్యారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు, మాజీలు కూడా హాజరయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ఎంతో ఆశపడ్డారు యనమల. అయితే చంద్రబాబు మాత్రం పూర్తిగా యువతకే ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే యనమలకు మరో అవకాశం రాదు. కానీ యనమల మాత్రం తన మనసులో మాట బయటపెట్టారు. పార్టీ అవకాశమిస్తే.. రాజ్యసభకు వెళ్లాలని ఉంది అంటూ వ్యాఖ్యానించారు. దీనికి కులం కార్డు కూడా వాడుతున్నారు. బీసీ నేతకు చంద్రబాబు ఎన్నో అవకాశాలిచ్చారని… రాజ్యసభకు కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వాస్తవానికి యనమల కుటుంబానికి చంద్రబాబు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశారు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారు. పైగా కుమార్తె విప్ కూడా. యనమలకు పార్టీ ఇంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ… ఆయనలోని పదవీ వ్యామోహం ఇంకా తీరినట్లు లేదు. అందుకే ఈసారి కేంద్రంలోని పెద్దల సభకు వెళ్లాలని ఉందంటూ అధినేతకు సైలెంట్‌గా ప్రపోజల్ పెట్టారు యనమల.