ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం అది.. తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి గెలవడానికి ఆ పార్టీ కార్యకర్తలు ఎంతగానో కష్టపడ్డారు. రాజకీయంగా పార్టీ బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా సరే పార్టీ అక్కడ విజయం సాధించకపోవడం.. పార్టీ కార్యకర్తలను మరింత ఇబ్బంది పెట్టింది. అయితే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా అక్కడ గురిపెట్టడంతో కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేశారు. దీనితో చాన్నాళ్ల తర్వాత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా సగర్వంగా ఎగిరింది.
Also Read : అమరావతి పనుల ప్రారంభంపై క్లారిటీ..!
అయితే ఇప్పుడు ఎమ్మెల్యే విషయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎన్నో ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం ఒక సమస్య అయితే.. నియోజకవర్గంలో మండలానికి నాయకుడికి బాధ్యతలు అప్పగించి ఎమ్మెల్యే సైలెంట్ గా ఉండిపోయారు. దానికి తోడు నియోజకవర్గంలో వలసనేతల పెత్తనం కూడా ఎక్కువైపోవడంతో ఇప్పుడు క్యాడర్ ఇబ్బందులు పడుతోంది. చిన్న పని కావాలన్నా సరే ఎమ్మెల్యే కంటే మండల స్థాయి నాయకులతోనే జరుగుతోంది అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి.
Also Read : ఫైబర్ నెట్ మరో సంచలనం.. మంత్రికి దినేష్ కుమార్ నివేదిక..!
ఇక టిడిపి క్యాడర్ కూడా వలసనేతల వద్దకు వెళ్లి తన పనులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వలసనేతల పెత్తనం ఎక్కువగా కనబడుతోంది. ఎమ్మార్వోలు గాని వీఆర్వోలు గాని ఎవరు ఏ పని చేయాలన్నా సరే.. వలసనేతల రికమండేషన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఎమ్మెల్యే కనీసం సొంత సామాజిక వర్గానికి కూడా ఏం చేయడం లేదనే అసహనం నియోజకవర్గంలో ఎక్కువగా వినపడుతోంది.
Also Read : ఐపిఎల్ కు కేంద్రం షాక్.. ఆ ప్రకటనలు అన్నీ బ్యాన్
తమ ప్రత్యర్ధి సామాజిక వర్గం ఇన్నాళ్లు అధికారంలో ఉండగా.. ఇప్పుడు కష్టపడి తమ నేతను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే.. కనీసం ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడమే కాకుండా అక్కడ అగ్రకులాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, మండల స్థాయి నాయకులు మొత్తం వారినే నియమించుకున్నారని పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఇసుక మద్యం విషయంలో ఎమ్మెల్యే మనుషులు చేస్తున్న వసూళ్లపై ఇప్పుడు పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఎమ్మెల్యేకు తెలిసినా సరే చూసి చూడనట్టు వ్యవహరించడమే కాకుండా.. పార్టీ సీనియర్ కార్యకర్తలు తన వద్దకు వెళ్ళినా సరే.. కనీసం వారికి చిన్న పని కూడా చేయలేని స్థితిలో ఎమ్మెల్యే ఉండటం చూసి కార్యకర్తలు కన్నీరు పెట్టుకుంటున్నారు.




